పవన్‌పై కక్ష కట్టారు.. ఇన్ని నెగిటివ్ వార్తలా?
on Mar 18, 2017
పవన్ కల్యాణ్ సినిమా విడుదల అవుతోందంటే... ఆ హంగామా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవొచ్చు. విడుదలకు ముందే రికార్డుల గురించి మాట్లాడుకొంటారు. పవన్ నటించిన ఏ ఒక్క సినిమా ఇప్పటి వరకూ.. నెగిటీవ్ టాక్‌తో బయటకు రాలేదు. ఆఖరికి సర్దార్ గబ్బర్ సింగ్‌తో సహా. ఆ సినిమా కూడా రికార్డులు బద్దలు కొట్టేస్తుందనే ఆశించారు. అందుకే అదే స్థాయిలో తొలిరోజు భారీ వసూళ్లు సాధించింది. అయితే... కాటమరాయుడు విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఈ సినిమాపై నెగిటీవ్ వార్తలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. పాటలు బాగో లేదని, అనూప్ పై పవన్ కోపంగా ఉన్నాడని అంతకు ముందుకొన్ని వార్తలొచ్చాయి.
కాటమరాయుడు రీషూట్ చేస్తున్నారని, కొన్ని సన్నివేశాల్ని పూర్తిగా తొలగించి కొత్త గా రాయించారని చెప్పుకొన్నారు. ఏప్రిల్ 24న ఈ సినిమా వస్తుందని చిత్రబృందం ఎన్ని సార్లు చెప్పినా... ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని గాసిప్పులు షికారు చేశాయి. ఇప్పుడు సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఫస్టాఫ్ బాగోలేదని, సెకండాఫ్ కూడా అంతంత మాత్రమే అని చెప్పుకొంటున్నారు. ఇదంతా ఓ వర్గం కావాలని పనిగట్టుకొని చేస్తున్న ప్రచారమని, పవన్‌పై కక్ష కట్టి.. నెగిటీవ్ వార్తలు పుట్టిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే డీజే డిజ్ లైక్స్ వ్యవహారం టాలీవుడ్‌ని షేక్ చేసింది. పవన్ ఫ్యాన్స్ కావాలనే డీజే టీజర్‌కి ఇన్ని డిజ్ లైక్స్ వచ్చేలా చేశారని చెప్పుకొన్నారు. ఈసారి బన్నీ అభిమానుల వంతు వచ్చిందని, వాళ్లే... కాటమరాయుడుని బ్యాడ్ చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో, మెగా అభిమానుల్లో ఉన్న ఈ వేరు కుంపట్లు.. వాళ్ల సినిమాలకే తూట్లు పొడుస్తున్నాయి. మరి ఈ యుద్ధం ఆగేదెప్పుడో...?
Also Read