గబ్బర్ సింగ్ కి పోటీగా రబ్బర్ సింగ్
on Feb 16, 2015
టాలీవుడ్ టాప్ కామెడియన్ బ్రహ్మనందం ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ముఖ్యపాత్రను పోషించారు. అందుకే ఆయన కోసం దర్శకులు కొత్తగా ఆలోచిస్తూ పలు పాత్రలను సృష్టిస్తూ వుంటారు. ఈ క్రమంలో లేటెస్ట్ ఆయన హీరోగా మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా పేరు రబ్బర్ సింగ్. ఇది గబ్బర్ సింగ్ సినిమాకి పేరడీగా భావించవచ్చు. గబ్బర్ సింగ్ సినిమాలో రికవరీ రంజిత్ కుమార్ గా నటించిన బ్రహ్మానందం రబ్బర్ సింగ్ లో ఎలాంటి పాత్ర పోషించనున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకి నాగేంద్ర దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో ఈ చిత్ర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.