పోస్టర్ వెనుక కథ
on Apr 21, 2017
మనం ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత మన మదిలో ఎన్నో సందేహాలు..మూవీ బిగినింగ్‌లో కనిపించిన వ్యక్తి..మళ్లీ ఎందుకు కనిపించలేదనో..ఎక్కడో లాజిక్ మిస్సయ్యిందనో తెగ ఆలోచిస్తూ ఉంటాం..అలాంటి ఎన్నో లోపాల్ని వెతికి కనిపెట్టి మన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే..విజువల్ వండర్‌గా తెరకెక్కి..తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి బిగినింగ్‌లో అనేక సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు"..ఈ ప్రశ్నకు సమాధానం కోసం సినీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తుంటే..బాహుబలి-2 రిలీజ్ కాకముందే మరో డౌట్ పెట్టాడు జక్కన్న.
అదేంటంటే బాహుబలి-2 ట్రైలర్ ఎండింగ్లో ప్రభాస్, రానాలు ముఖాముఖి తలపడతారు. ఆ ఇందులో ఏముంది క్లైమాక్స్‌లో జరిగేది ఇదేగా అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడే రాజమౌళి తన మార్క్ చూపించాడు. నెరిసిన గడ్డంతో రక్తం కారుతూ రానా వృద్ధుడిలా కనిపిస్తుంటే..ప్రభాస్ మాత్రం యంగ్‌గా కనిపిస్తున్నాడు. పైగా మెడలో శివలింగం..ఇది పార్ట్ 1లో శివుడి గెటప్..అంటే తండ్రిని చంపించినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు శివుడు, భల్లాలదేవుడితో తలపడుతున్నాడు అనుకోవాలా..? మరోవైపు అమరేంద్ర బాహుబలి చనిపోలేదు..కన్‌క్లూజన్‌లో ఎంట్రీ ఇస్తాడు అని కొంతమంది అంటున్నారు..దీంతో అభిమానుల బుర్రలు హిటెక్కిపోతున్నాయి. మరి రానాతో తలపడేది ఎవరో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.