రంగస్థలంలో ఎన్టీయార్?
on Feb 19, 2018
చనిపోయి 24 ఏళ్లవుతున్నా...ఇంకా వెండితెరపై జిలుగువెలుగులు కురిపిస్తూనే ఉన్నారు ఎన్టీయార్. ఇప్పటికే ఆయన పేరిట మూడు బయోపిక్ లు మొదలయ్యాయ్. సావిత్రి బయోపిక్ లోనూ ఆయన పాత్ర కీలకమే.. ఇవి చాలవన్నట్టు... రాబోయే ‘రంగస్థలం’ లో కూడా ఎన్టీయార్ కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయ్. ఫిలింనగర్ లో బలంగా వినిపిస్తున్న ఈ వార్త.. సినిమాపై ఊహించని అంచనాలు పెంచేస్తోంది. ఇప్పటికే రంగస్థలం అంచనాలు ఆకాశంలో ఉన్నాయ్. విడుదలైన టీజర్లు, పాటలు సోషల్ మీడియాలో దుమ్మ దులిపేస్తున్నాయ్. దీనికి తోడు ఈ ఎన్టీయార్ న్యూస్ సినిమాకు కొత్త శోభను తెచ్చిపెట్టింది.
1985 నాటి కథ అవ్వడంలో నాటి మండల స్థాయి రాజకీయ పరిస్థితులని సుకుమార్ కళ్లకు కట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్టీయార్ పాత్ర కనిపిస్తుందని తెలుస్తోంది. మరి ఆ పాత్రను ఎవరితో చేయిస్తారో చూడాలి. రాజకీయంగా ఎన్టీయార్.. సినిమా పరంగా మెగాస్టార్ చెలరేగి పోతున్న సమయం 1985. ఆ టైమ్ లో సాగే కథ అంటే... నాటి కాలమాన పరిస్థితుల్ని అద్దం పట్టే విధంగా ఎన్టీయార్, మెగాస్టార్లను ఏదో ఒక విధంగా చూపించాల్సిందే. మరి సుకుమార్ ఏం చేస్తాడో చూడాలి.
ఏది ఏమైనా... ‘రంగస్థలం’ మాత్రం.. ప్రీ రిలీజ్ కు ముందు... సుకుమార్ గత చిత్రాలను మించి అంచనాలను దాటిపోయిందని చెప్పక తప్పదు. దురభిమానులు సైతం సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.