మహేష్ తప్పించుకున్నాడు.. రవితేజ దొరికిపోతాడా ?
on Jan 19, 2017
ఏమైందో ఏంటో గానీ చాలా విరామమే తీసుకున్నాడు రవితేజ. రవితేజలో అభిమానులకు నచ్చింది ఆయన యాటిట్యుడే. ఆ యాటిట్యుడ్ సినిమాలోనే కాదు. ఆయన సినిమా మేకింగ్ లోనూ కనబడుతుంది. ఫాస్ట్ గా జరుగిపొతుంటాయి ఆయన సినిమాలు. ఓ సినిమా పూర్తయ్యేలోగా మరో సినిమా సెట్స్ పైకి వెళ్ళిపోతుంటుంది. అయితే ఇప్పుడు రవితేజ కొత్త సినిమా విషయంలో జరుగుతున్న జాప్యం చర్చనీయంశమైయింది. బెంగాల్ టైగర్ తర్వాత మళ్లీ కెమరా ముందుకు రాలేదు రవితేజ. కధ సెట్ కాలేదా? అంటే అదీ లేదు.
ఓ నలుగురు దర్శకులు కధలతో రెడీగా వున్నారు. దిల్ రాజుతో ఓ సినిమా అనుకున్నారు అప్పట్లో. రేమ్యునరేషన్ దగ్గర తేడా వచ్చి డ్రాప్ అయిపోయిందని వినిపించింది. తర్వాత అదీ ఇదీ అంటున్నారే కానీ ఏదీ పక్కా కావడం లేదు. ఈ గ్యాప్ లో ఆయన కుటుంబంతో ప్రపంచ యాత్రలకు వెళ్లిపోయారని మిత్రుడు పూరిజగన్నాధ్ మొన్నామధ్య చెప్పారు. ఈ ప్రపంచ యాత్ర ముగించికొని మళ్ళీ ఇంటికి చేరుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం ఓ ప్రాజెక్ట్ ని ఫైనల్ చేసే పనిలో వున్నారు రవితేజ్.
అయితే నేపధ్యంలో ఓ దర్శకుడు రవితేజతో ఓ సినిమాని చేయాలనే ప్రయత్నాల్లో వున్నాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు.. మెహర్ రమేష్. మెహర్ రమేష్ అంటే భారీ ఫ్లాపులు గుర్తొస్తాయి. భారీదనంతో సినిమాలు తీసే మెహర్ అంతే స్థాయిలో ఫ్లాఫ్ రికార్డులను మూటకట్టుకున్నాడు. ఎన్టీఆర్ 'శక్తి' దెబ్బ మాములుగా పడలేదు. ఎవరి సంగతి ఏమిటో కానీ.. నిర్మాత అశ్వనీదత్ కుదేలైపోయారు. మొన్నో ఇంటర్వ్యూలో శక్తి సినిమా గురించి చెబుతూ 'అదో పీడకల వదిలేయండి' అంటూ హడలిపోయే ఎక్సప్రెషన్ ఇచ్చారంటే శక్తి దెబ్బను అర్ధం చేసుకోవచ్చు .
ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వెంకటేష్ తో 'షాడో' తీశాడు మెహర్ రమేష్. ఈ సినిమా కూడా పెద్ద డిజాస్టర్. దీని తర్వాత మళ్ళీ కనిపించలేదు మెహర్. అయితే తెరవెనుక ప్రయత్నాలు మాత్రం వదల్లేదాయన. మహేష్ బాబు కి టచ్ లో వున్నాడు. మొన్న మహేష్ తో ఓ కమర్శియల్ ని కూడా షూట్ చేశాడు. ఈ గ్యాప్ లో మహేష్ కు ఓ కధ కూడా చెప్పాడు. అయితే అది మహేష్ ని అంత ఇంప్రెస్ చేయలేదట. దీంతో సున్నితంగా వద్దనేశారని భోగట్టా. అయితే ఇప్పుడు అదే కధను రవితేజతో ఓకే చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడట మెహర్. మరి ఈ కధకు రవితేజ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.