సీఎంగా మహేశ్..ఏ రాష్ట్రానికి..?
on Sep 26, 2016
లైఫ్‌లో ఒక్కసారైనా సీఎం కాని..పీఎం కాని అవ్వాలని మనలో చాలామందికి ఉంటుంది. కాని అదంత ఈజీ కాదు. అందుకే ఏం చేస్తాం కలలు కంటాం. అయితే యాక్టర్స్‌కి మాత్రం ఆ ఫీల్ అనుభవించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చాలా మంది హీరోలు రీల్ లైఫ్‌లో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. "ఒకేఒక్కడు"లో అర్జున్, "లీడర్"లో రానా ఇలా చాలా మంది సీఎం కుర్చీ ఎక్కారు. తాజాగా నేను కూడా ముఖ్యమంత్రిని అవుతానంటున్నాడు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు. మహేశ్-కొరటాల కాంభినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమాలో ప్రిన్స్ సీఎంగా నటించనున్నాడట.
మిర్చి నుంచి జనతా గ్యారేజ్ వరకు అన్ని సినిమాల్లోనూ సామాజిక సందేశాన్నిచ్చే కథలతో ప్రేక్షకుల్ని అలరించిన కొరటాల తన కొత్త సినిమాలో కూడా సోషల్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ ముఖ్యమంత్రి క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడట. గతంలో దూకుడు సినిమాలో ఎమ్మెల్యేగా కనిపించిన మహేశ్ ఇప్పుడు సీఎంగా ఎలా అలరిస్తాడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇది వరకు సినిమాల్లో హీరోలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే తెలుగు నేల రెండు ముక్కలయిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అనే పదం వాడుతున్నారు తప్ప ఏ రాష్ట్రం అనేది చెప్పడం లేదు. మరి మహేశ్ ఏ రాష్ట్రానికి "చీఫ్ మినిస్టర్" అన్నది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పదు.