మరో సినిమా జంట విడిపోతున్నారా ??
on Jun 25, 2016
ఈమధ్య "బ్రేకప్" చేసుకోవడం లేదా "విడాకులు" తీసుకోవడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. నిన్నమొన్నటివరకూ బాలీవుడ్ కు పరిమితమైన ఈ పోకడ ఇప్పుడు టాలీవుడ్ కు కూడా పాకింది. ఇక్కడ కూడా ఈమధ్య "బ్రేకప్"లు, "విడాకులు" చాలా సాధారణ విషయాలుగా మారిపోయాయి. అయితే.. బాలీవుడ్ తరహాలో పబ్లిక్ గా ప్రకటించుకోవట్లేదు, అంతే తేడా! ఇప్పుడు ఈ పోకడలో విడాకులకు సిద్ధమవుతోంది హీరోయిన్ కళ్యాణి మరియు దర్శకుడు సూర్యకిరణ్ ల జంట. ఈ ఇద్దరికీ పెళ్లాయ్యాక.. ఇద్దరి కెరీర్ లు దాదాపుగా క్లైమాక్స్ కు చేరుకొన్నాయి. అవకాశాలు లేక చాలా ఇబ్బందిపడ్డారు. ఆ చిరాకులో గొడవలు పడ్డారో లేక నిజంగానే ఇద్దరికీ పడటం లేదో తెలియదు గానీ ఇప్పుడు ఈ ఇద్దరు విడాకులు తీసుకోనూన్నారని ఫిలిమ్ నగర్ లో టాక్. ఈ వార్తలో నిజం ఎంత అనే విషయం ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పేదాకా తెలియదు!
Also Read