రకుల్ కిస్ కంపల్సరీ!
on Oct 6, 2015
టాలీవుడ్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా హవా నడిపిస్తూ, ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే టాప్ హీరోల పక్కన నటించే ఛాన్సులు కొట్టేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్కి ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందట. రకుల్ ప్రీత్ సింగ్ ఏ సినిమాకి సైన్ చేయాలన్నా, సదరు సినిమాల దర్శక నిర్మాతలు, హీరోగారు లిప్ టు లిప్ కిస్ సీన్ కంపల్సరీ అని నిబంధన పెడుతున్నారట.
ఆమధ్య వచ్చి అట్టర్ ఫ్లాపైన ‘కిక్-2’ సినిమాలో రకుల్ ఓల్డ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రవితేజకే లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది. రవితేజకే కిస్సివ్వగా లేనిది ఆయన కంటే యంగ్ హీరోలకి కూడా కిస్సివ్వడంలో తప్పేమీ లేదని అంటున్నారట. అయితే రకుల్ మాత్రం కిస్సులు ఇచ్చి తీరాల్సిందేనని నిబంధనలు పెడుతున్నారని ఎంతమాత్రం ఫీలవటం లేదట. సినిమాలో ఒక లిప్ టు లిప్ కిస్కి తన అంగీకారం తెలియజేస్తోందట.
రకుల్ ప్రీత్ సింగ్ అందమంతా ఆమె పెదవుల్లోనే వుందని ఆమె అభిమానులు అంటూ వుంటారు. అలాంటి అందమైన పెదవులతో హీరోలకి కిస్సిచ్చే సీన్లు చాలా ‘కిక్’ ఇస్తున్నాయని వాళ్ళు ఫీలవుతున్నారట. ఏది ఏమైనా తెలుగులో కూడా లిప్ టు లిప్ కిస్సులు ఇవ్వడానికి ఎంతమాత్రం అభ్యంతరం చెప్పని హీరోయిన్ల సంఖ్య గణనీయంగా పెరగడం చాలా మంచి పరిణామమని చాలామంది కిస్సుమంటూ నవ్వుతూ అంటున్నారు.