బాలయ్యకు ఆ ఇద్దరు!
on Jul 6, 2015
బాలయ్యకు లెజండ్ బ్యూటీలపై మోజు తీరలేదా? లేదా సెంటిమెంట్ గా ఫీలవుతున్నాడా? లేదా హీరోయన్లు దొరక్క వాళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడా? ఫిల్మ్ నగర్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. లెజెండ్ లో బాలయ్యతో ఆడిపాడిన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ ను ఇప్పట్లో బాలకృష్ణ వదిలేట్టు లేడు. ఎందుకంటే లెజెండ్ తర్వాత వచ్చిన లయన్ లో త్రిష మెయిన్ హీరోయన్ కాగా...రాధికా ఆప్టేను మరో హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందన్న సంగతి తెలిసిందే.
అయితే ఈసారి కాస్త రూటు మార్చి మరో బ్యూటీ సోనాల్ చౌహాన్ పై కన్నేశాడట. లేటెస్ట్ మూవీ డిక్టేటర్లో ఇప్పటికే అంజలి మెయిన్ హీరోయిన్ కాగా...మరో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ను తీసుకోనున్నారని టాక్. సెంటిమెంట్ ప్రకారం రాధికను తీసుకుంటే లయన్ ఫ్లాప్ అయింది. ఈసారి సోనాల్ చౌహాన్ అయినా లెజెండ్ లాంటి విజయాన్నిస్తుందని నమ్ముతున్నారట.
దీంతో కారణాలేమైనా...లెజెండ్ బ్యూటీలపై బాలయ్య మోజు తీరలేదా అని డిస్కస్ చేసుకుంటున్నారు. మరి నటసింహం కోరిక సోనాల్ అయినా తీరుస్తుందో లేదో?