దిల్ రాజు "పిల్లా నువ్వులేని జీవితం" అనే చిత్రాన్ని నిర్మించనున్నారట. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "గబ్బర్ సింగ్" చిత్రంలోని "పిల్లా నువ్వులేని జీవితం" అనే పాట సూపర్ హిట్టయ్యింది. ఆ పాటలోని "పిల్లా నువ్వులేని జీవితం" అనే పేరుని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించాడట.
అంటే ఆ పేరుతో సినిమా తీయనున్నాడనేది స్పష్టం. అయితే ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లు ఎవరు...? ఏ దర్శకుడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఏ సినిమా అయినా పేరు బాగుంటే ప్రేక్షకుల్లోకి బాగా వెళుతుందనేది నిర్మాత బలంగా నమ్ముతాడు. |