Facebook Twitter
అనురాగం పంచే రక్షాబంధనం (కవిత)

 

అనురాగం పంచే రక్షాబంధనం




శ్రావణ పూర్ణిమ- రాఖీ పండుగ
రక్షా బంధనం – నేటి ఉదంతం
రక్షా బంధన్  రాఖీపండుగ
రకరకాల పేరుల భరతావని
పెద్దల పిన్నల భేదం లేకనె
ప్రీతిగ జరుపు కొనేదీ పండుగ.
రకరాల రాఖీల నెంచి –పలు
రకాల మిఠాయి లెన్నో చెసీ-
అక్కా చేల్లెళ్ళందరు కలసి –
అన్నాదమ్ముల చేతుల గట్టగ
పళ్ళెంలో ఒక కొబ్బరి  బొండం
పళ్ళెంలో  కుంకుమ  తడి తిలకం
పళ్ళెంలో వెలిగే శుభ దీపం
పళ్ళెంలో  అక్షిత  సమూహం
ఆ వదనంలో సుమ దరహాసం
ఆ కన్నులలో మెరపు ప్రకాశం
ఆ చేతులలో  రక్ష విశేషం
ఆ మనస్సులో  రక్షిత భావం !
అన్నీ కలగలుపుగ కలిసి కలిసి
అన్నదమ్ముళ్ళ కూర్చుండ  జేసి
నుదుటను చక్కని తిలకము దిద్దీ
నూ రెండ్ల కు  అక్షింతలన ద్దీ
కుడిచేతికి  రక్షన్నట  గట్టీ
కుల మతాల కతీతము నెంచీ
నోటికి తీపి పదార్థ మందించీ
నోటివ్వగా నెంతో సంతోషించీ
నేను నీకు రక్షనౌదును  గాత!
నీవు నాకు  రాక్షవౌదువు గాత !
అనెడి భావనను  మనసుల నింపి
అన్న చెల్లెళ్ళు  రక్షణ  నుందురు !
ఒకరి కొకరు రక్షణ కల్పిస్తే
ఒకరి నొకరు మంచిని పంచిస్తే
సమాజమంతా ఒకటౌతుంది!
సమ సమాజమే సిద్దిస్తుంది !

రచన :- నల్లాన్ చక్రవర్తుల వేంకట రంగనాథ్