Facebook Twitter
వరలక్ష్మీ వ్రతం (కవిత)



తలంటు పోసుకొని
పాలల్లో కడిగిన ముత్యంలా
పదహారణాల తెలుగింటి పడుచు

ఈ నభో (ఆకాశం) మాసాన
తారకలన్నీ దిగివచ్చినట్టుగా
దేవి ముందు జ్యోతులై వెలుగంగ

కన్నె మెుగిలిపువ్వువంటి
మెుగున్నియ్యవేనని కోరంగ
ముత్తైదువ నూరేళ్ళ
సౌభాగ్యాన్నియ్యవేయని మెుక్కంగ

ఈ వెన్నెల రేడు మాసాన
మనోకారకుడైన చంద్రుడు
కలతలన్నీ బాపంగ

పూజింపరే తల్లిని
ఆయురారోగ్యాలు చేకూర
సేవింపరే దేవిని
మనోభీష్టిని వెలిగించ

తరియింపరే జనులు
ఆనందముతోడ
వందనమనరే దేవికి
వరలక్ష్మీ వారమున

 

 

 

- సరిత భూపతి