Facebook Twitter
" అతడు......నింగి కెగసిన భారత మిసైల్ "

" అతడు......నింగి  కెగసిన  భారత  మిసైల్ ".   
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰   

అతడు నింగి కెగసిన మిసైల్ .   
అతడు ఎనభై నాలుగేళ్ళ నవ యువకుడు.   
పిల్లల్లో పిల్లడైన పెద్ద మనుష్యుడు .   
యువ స్వప్నం స్వాగతించిన సాహసికుడు !   


పల్లె నుంచి పై కెగసిన పారమార్ధికుడు.   
ఓటమిన  గెలిపించిన మహా సాధకుడు !   
పేదల ఆరోగ్యానికి శాస్రీయ రక్షకుడు !   
మార్మికుడుగ కనిపించిన బోళా శంకరుడు ! 
  

భీకర క్షిపణులనే శృతిజేసిన వైణికుడు !   
ఎడారి నన్వస్త్రములను పేల్చిన స్మైలింగ్ బుద్ధుడు !   
పనిలో విశ్రాంతి వెదుకుకున్న నిత్యసత్య శ్రామికుడు !   


రామేశ్వర గృహమునుండి రాష్ట్రపతీ భవన్ వరకు   
రాజపథము పై నుండి దూసుకొచ్చిన "భారత రాకెట్టు" !   
శత్రువుల్నిల ఓడించుటలో...మిత్రుల్నీ పొందుటలో-   
ఆయన చేసిన మిసైల్ కంటె ,ఆయన నవ్వే పవర్ ఫుల్ !
   

అతడో గొప్ప ప్రొఫెసర్ !.. అతడో గొప్ప సైంటిస్ట్ !   
అతడో గొప్ప స్పీకర్ !..అతడో గొప్ప లీడర్ !   
అతడో గొప్ప స్వాప్నికుడూ..అతడో గొప్ప ప్రేమికుడూ..   
అతడో నిత్య విద్యార్ధీ ....అతడు నిరంతర బోధకుడూ !   


అతడు సామాన్యునిగ కన్పించే.. గొప్ప అసామాన్యుడూ..   
గొప్ప అనితర సాధ్యుడూ .....!   
ఆత డన్నిటి కంటే మించిన పరమ దేశ భక్తుడు !   
భరత మాత సేవకే తన తనువంతా నర్పించిన   
భారతరత్నే ! మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం !   
భారతీయుల  అశ్రుతర్పణ అందుకో ఆఖరి సలాం !!   
భారతజాతిది ఉండు వరకు నిన్ను మరువము యిది నిజం !!!   
జయహింద్ ! జయహింద్ ! జయహింద్ !!! ॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

నల్లాన్ చక్రవర్తుల వేంకట రంగనాథ్