Facebook Twitter
బాలగేయం

 

బాలగేయం

 


పువ్వులం -మేం నవ్వులం ,
అమ్మపెదవుల పైన నిలిచే …
కమ్మనైన కాంతులం.

1. అమ్మ మాకు మొదటి దైవం –
  నాన్న మాటే మాకు వేదం ,
   పెద్దలకు మేం మన్ననిస్తాం   
   గురువులను మేం గౌరవిస్తాం .//పువ్వులం//

2. అందరితొమేం కలసిఉంటాం
  అరమరికలు వదలివేస్తాం
  వినయమే మా వారసత్వం
   మంచితనమే మాకు నేస్తం. .//పువ్వులం//

3. సత్యధర్మ శాంతిప్రేమలు-
 చక్కగామేం అనుసరిస్తాం
 భావిభారత పౌరులంగా
 భరత మాతను సేవచేస్తాం .//పువ్వులం//

4. క్రమంతప్పక బడికిపోయి
    వెలుగు చూపే విద్యనేర్చే
    బుల్లి బుల్లి బాలలం
    చిన్ని చిన్ని దివ్వెలం .//పువ్వులం//-

--ఆదూరి.హైమవతి