Facebook Twitter
రాలిన సాహితీ తార.. రాళ్ళబండి

ఆయన ప్రముఖ సాహితీవేత్త.

సాంస్కృతికశాఖలో పలు కీలక పదవులను నిర్వహించారు.

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి  డాక్టరేట్ తీసుకున్నారు.

అష్టావధానం, నవరసావధానం, శతావధానం, ద్విశతావధానం సహా ఐదు వందలకు పైగా అవధానాలు నిర్వహించారు.

 ఒంటరి పూలబుట్ట, పద్య మండపం, అగ్నిహింస, ఇది కవి సమయం వంటి అనేక పుస్తకాలు రాశారు.

ఆయనే భాషా సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు రాళ్లబండి వెంకట ప్రసాద రాజు... మనందరికీ కవితా ప్రసాద్‌గా పరిచయం.

భద్రాద్రి రాముని కళ్యాణం... ఆ రాముని గుణగణాలను, సీతమ్మ సుకుమార సౌందర్యాన్ని కవితా ప్రసాద్ మాటలలో వింటుంటే... సాక్షాత్తు ఆ శ్రీరామ చంద్రుడిని నేరుగా దర్శించినట్టే వుండేది. స్పష్టమైన ఉచ్ఛారణ, అనర్గళంగా
మాట్లాడగలిగే వాక్పటిమా ఆయన స్వంతం.

ఆయన మరణం సాహితీ జగత్తుకి ఒక తీరని లోటు.

ఆయన స్మృతికి ‘తెలుగువన్’ నివాళులర్పిస్తోంది.

 

CLICK HERE FOR Rallabandi Kavitha Prasad at teluguone Photos