Facebook Twitter
ఆయన జీవితం కళామయం

 

ఆయన జీవితం కళామయం



ఆయన ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా తీర్చిదిద్దిన ప్రముఖ రచయితలలో ఒకరు.
ఆయన పత్రికా రచయిత, పత్రికా సంపాదకుడు, మొట్టమొదటి చలన చిత్ర కళా దర్శకుడు ,ప్రముఖ చిత్రకారుడు, మహా వక్త . ఆయన నవలలు తెలుగు నవలా సాహిత్యం లో మైలురాళ్ళు .

కులపతి ఆయన బిరుదు.. అడవి ఆయన ఇంటి పేరు.. బాపిరాజు ఆయన పేరు .

ఆయన 12 నవలలు రాసారు. అందులో ముద్రితాలు తొమ్మిది , అముద్రితాలు మూడు . అందులో నారాయణరావు ,తుఫాను,కోనంగి వంటి ఐదు సాంఘిక నవలలు , గోనగన్నారెడ్డి ,మధురవాణి ,హిమబిందు మొదలైన ఏడు చారిత్రక నవలలు . సాంఘిక నవలలని రాసి ఎంతగా మెప్పించ గలిగారో ..చారిత్రక నవలలని రాసి కూడా అంతే  మెప్పు పొందారు .


  వీరి సాంఘిక నవలల్లో అగ్ర స్థానం లో నిలిచేది 'నారాయణరావు'  నవల. ఇది  పాత్ర ప్రధాన మైన నవల.  తెలుగునాట జమిందారుల కధ. సమకాలీన ఆంధ్ర సామాజికుల సమస్యల్ని ,భూ కామంధుల్ని, జమిందారీ వ్యవస్థ నిర్ములనాన్ని ,  ఆంధ్ర జాతీయ స్వతంత్రోద్యమాన్ని , గాంధీ  సిద్దాంతాల్ని ఈ నవలలో బాపిరాజు గారు ప్రతిబింబింప చేసారు . అలాగే కధని ఎంతో నేర్పుతో పాటకుల హృదయాలని తాకే లా తీర్చి  దిద్దారు. "నీకు పెండ్లి అయినదా ? ' అనే శీర్షికతో ఈ నవల ప్రారంభ మవుతుంది .ఈ శీర్షిక కిందే నారాయణరావు ,అతని మిత్రులు మనకి పరిచయం అవుతారు . నవల ఆద్యంతం పాటకులని కట్టి పడేస్తుంది. అందుకే ఈ నవలకి ఎన్నో బహుమతులు, గుర్తింపులు దక్కాయి. 1934  లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ వారు నిర్వహించిన నవలా రచన పోటిలో ఈ నవలకి ఉత్తమ బహుమతి వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమి వారు వివిధ భాషల లోకి అనువదింప చేసారు . ఇక వివిధ విశ్వ విద్యాలయాలు ఈ నవలని పాట్య గ్రంధం గా కూడా పెట్టాయి.

  బాపిరాజు గారికి  చిన్నతనం నుంచి గేయాలు  రాయటం అలవాటు . పిల్లల కోసం ..పిల్లల గేయాలని కూడా రాసారు. ఇక ఈయన రాసిన వచన కవితలు,  వచన కవితా లోకం లో ప్రత్యేక స్థానాన్ని పొందాయని చెప్పచ్చు .ఎన్నో వ్యాసాలు రాసారు ఆయన. భారతీయ చలన చిత్ర రంగంలో ప్రప్రదమంగా ఆంధ్రచలనచిత్ర కళా దర్సకత్వం వహించినవారు బాపిరాజు గారేనంటారు .సతీ అనసూయ ,ధ్రువ విజయం,మీరాబాయి ,చిత్రాలకి కళా దర్సకత్వం వహించారు. ఇక చిత్ర కళ విషయానికి వస్తే ఎన్నో ఉత్తమ కళా కండాల్ని సృష్టించారు .మంచి వక్తగా కూడా ఈయనకి పేరు.ఏ విషయం మీద అయనా శ్రోతల్ని అలరిస్తూ ,కమ్మని ఛలోక్తులతో గంటలు తరబడి ఉపన్యాసం ఇవ్వగల మహా వక్త.

ఆయన సాహిత్య సంపద అంతా ఒక ఎత్తు . ఆయనొక ఎత్తు .


అతనున్న చోట ఆనందం తాన్డవిస్తుందని , వారిది గొప్ప వ్యక్తిత్వమని పేరు.

 అడవి బాపిరాజు గారి రచనలని ఒక్కసారి చదివి ఆ మాదుర్యాన్ని రుచి చూడాల్సిందే  తప్ప ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది .

- రమ