Facebook Twitter
వెలుగుల రోజు
వెలుగుల రోజు
 
 
 
 మనిషికి మనిషికి మధ్య చీకటి తెరలు
జారుతున్నాయి ఈవేళ
స్నేహపు చిరునవ్వులోనూ విషపుజాడలు
ఇపుడు మనుషుల మధ్య సాగే నమ్మకాల జాలు
చీకటిమరకలు
చీకటి తీగలు తెరలుతెరలుగా, పొరలు పొరలుగా
చుట్టుకొని ఉప్పొంగే చీకటి సముద్ర అలలు
అయినా చీకటి అలుముకొనే రేయిలో
ప్రేమ వెన్నెల వర్షం కురిసి
పున్నమి నవ్వుల వెలిగేను వెన్నెలదీపాలు
జాతిదేహంపై కుట్రల విషవ్యూహాల్లోనూ చీకటే
కొంతమంది చీకటి ఏకాంతగానాన్ని ఆలాపిస్తారు
ఈచీకటిని బ్రద్దలు కొట్టేది ఖండించేది
వెన్నెల కొడవలి నెలవంకే ఆయుధం
చీకటంటే చీకటికాదు సర్పదారుణాలకు
దుర్మార్గ జంతుక్రూర చేష్టలకు నిలయమది
గుండెనిండా నవ్వేనవ్వులోనూ చీకటే నివాసం
వెలుగువెన్నెల జగతినిండా నిండినరోజు
లోకమంతా వెన్నెల దీపాలతో కాంతులీనేదే
నిజమైన పున్నమి జ్ఞానపు వెలుగులరోజు
 


సి.హెచ్‌.ఆంజనేయులు

సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో