Facebook Twitter
అభావం

అభావం

 



మనమెన్ని మాటల దారాల్ని పెనుకున్నాం
ఇప్పుడీ రహస్య వైరుధ్యత ఎందుకు పాపా!
అప్పుడు నువ్వు ' అమ్మ'! అనలేకపోయినా
నీ  ప్రతి అవసరానికి నేనున్నాను
నిద్రమేఘాలను ఉయ్యాలూపాను
ఉలికిపాట్లను ఓదర్చాను
తప్పటడుగులకి కలపకాశాను
పాల పళ్ళ జ్వరానికి నిఘా రెప్పనయ్యాను
నీ స్నేహ మైదానాలకోసం
ఇల్లంతా శూన్యాన్ని పరచుకున్నాను
నీ కలల సూర్యోదయం వెలుగులు చిమ్ముతున్న ఈ వేళ
నా నీడ కూడా నాతొ లేదమ్మా!
నువ్వు మాట్లాడలేకపోయిన పసివేళల్లో
నీ ప్రతి భావం అర్ధమైందిగానీ
ఇప్పుడు నువిన్ని మాట్లాడుతున్నా
ఇంత అభావం ఎందుకమ్మా!!! ?



సి. భవానీ