Facebook Twitter
అవ్వ-కోయిల

అవ్వ-కోయిల

 

 

- C రాజు

ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకు ఒక కోయిల ఉండేది. అవ్వ కోయిలను చాలా బాగా చూసుకొనేది. ఒక రోజు అవ్వకు జ్వరం వచ్చింది. అపుడు కోయిలకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అప్పుడది చాలా ఆత్రంగా తన మిత్రుడయిన కుందేలు దగ్గరికి వెళ్ళింది. కుందేలును కలిసింది. అప్పుడు, కుందేలు వచ్చిన మిత్రుడిని ఆప్యాయంగా పలకరించి, కోయిల రాకకుగల కారణాన్ని అడిగింది. అవ్వకు జ్వరంగా ఉన్న సంగతి చెప్పింది కోయిల. ’అవునా ! అరె ! పద..పద..పోదా’మని కుందేలూ, కోయిలా అవ్వదగ్గరికి వెళ్ళాయి. అవ్వను చూశాక కుందేలు, ’మిత్రమా ! నువ్వేమీ భయపడకు. ఈ జ్వరం ఇవ్వాళ కాకపోతే, రేపు పోతుందిలే! మరి నేను వెళ్ళి రేపు మళ్ళీ వస్తా’నని చెప్పి, వెళ్ళిపోయింది.

మరునాడు అది మళ్ళీ వచ్చింది; కానీ అవ్వకు జ్వరం తగ్గలేదు. కుందేలు ఆలోచించి, అవ్వకు తన మిత్రుడయిన ఆవు ఇచ్చే పాలను ఇస్తే, జ్వరం నయమవుతుందేమోనని, ఆవు దగ్గరికి వెళ్ళి, తన సహాయాన్ని అడిగింది. ఆవు, సంతోషంగా ఒప్పుకొని, కుందేలుతోపాటుగా అవ్వవాళ్ళ ఇంటికి వెళ్ళింది. కుందేలు పాలు పితికి, వాటిని కాంచి అవ్వకు ఇచ్చింది. అవ్వ పాలను తాగింది. మర్నాడు అవ్వకు జ్వరం బాగయింది. అందరూ చాలా సంతోషించారు. కలసిమెలసి ఆనందంగా జీవించారు.

 


కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో