Facebook Twitter
వలచి వచ్చిన వనిత - 7

  వలచి వచ్చిన వనిత

-వసుంధర

 

పార్ట్ - 7


   
"ఇదిమీకు న్యాయంకాదు, పెళ్ళైన దాన్ని__" అందామె ఇంచుమించు ఏడుస్తూ. ఆమె అసహాయత  నాకు  తెలిసిపోయేక నా ధైర్యం పెరిగింది. "నేను నీకుకొత్తకాదు___" అన్నాను.

    ఒక్కప్పుడు పార్వతి నన్ను లోంగదీసుకుంది. ఈ రోజునేనామెను లోంగదీసుకున్నాను.


    నేను వెళ్ళిన పని ఏమిటి__ చేసినపని ఏమిటి అనితల్చుకుంటే నాకేసిగ్గు వేసింది పశువులా ప్రవర్తించడమంటే ఆదేనేమో!

    అయితే నాసిగ్గూ, పశ్చాత్తాపం కొన్నిక్షణాలు మాత్రమే! మర్నాడు నేను మళ్ళీ  పార్వతి ఇంటికి వెళ్ళాను. తలుపు తీసిన  పార్వతి తలుపువేసు కొబోయింది. ఎలాగో లోపల అడుగు పెట్టాను. ఈరోజు ఆమె నిన్నటికంటే సులభంగా లొంగిపోయింది. మూడు వందల నోట్లుంచిన ఒక కవరు ఆమె గురించి వదిలేసి వచ్చాను.

    ఆ తరువాత కనీసం పదిసార్లు పార్వతి ఇంటికి వెళ్ళాను. ఈ పదిరోజుల్లోనూ ఆమెగురించి నేను ఎక్కువగా తెలుసుకున్నదేమీలేదు. పదకొండవసారి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడా ఇంటికీ  తాళంవేసి ఉంది.

    ఆవేసినతాళం చాలారోజులు అలాగేఉంది. ఒకనెల రోజుల అనంతరం మాత్రం___మళ్ళీతాళం తీసిఉంది. ఆశగా  వెళ్ళితలుపు తట్టాను. తలుపులు తెరుచుకున్నాయి. ఒకముసలమ్మగారు__"ఎవరుబాబూ__" అంటూపలకరించింది.

    కాస్తషాక్ తిన్నాను ఈ ఇంట్లో శంకర్రావుగారని ఒక రుండాలి!....."  

    "ఆయన ఇల్లు కాలీచేసి ఓ వారం  రోజులయుటుందనుకుంటాను నిన్ననే మేము దిగాం " అండా బామ్మగారు.

    నేను అక్కణ్ణించి బయట పడ్డాను. దొరికినట్లే దొరికి పార్వతి మళ్ళీమాయమైంది. ఆమెను గురించిన మిస్టరీ  అర్ధం  చేసుకుందుకు ప్రయత్నించవలసిన  నేను అలా చేయలేకపోయాను. నాలోని బలహీనత మరే ఇతర విషయంమీదా దృష్టిని కేంద్రీకరించలేకుండా చేసింది.....................

    రోజులు గడుస్తున్నాయి.

    ఉద్యోగానికి సంబందించి మళ్ళీ నేను క్యాంపుకు వెళ్ళవలసి వచ్చింది. ఈ పర్యాయం నాతోపాటు నాకోలీగ్ శివరావు కూడా ఉన్నాడు. ఇద్దరం కలిసి కాస్త ఓమాదిరి పెద్ద పట్టణానికే మూడువారాలటూర్ ప్రోగ్రాం మీద బయలుదేరాం.

    ఇద్దరం ఒకహొటల్ లో బసచేద్దామనుకుంటే శివరావు అలా వద్దన్నాడు చక్కగా  ఒక  ఫామిలీ పోర్ష్ న్ అద్దెకు తీసుకుందాం " అన్నాడు.

    నేను సరేనన్నాను. వెళ్ళినరోజు సాయంత్రం లగేజి క్లోక్ రూమ్ లో పడేసేక శివరావుని అనుసరించాను అతను తిన్నగా  ఒక హొటల్ కు  దారితీశాడు. అక్కడ అతను హొటల్  ప్రొప్రయిటర్ కి తన పేరుచెప్పి_  "నేను  వ్రాసిన ఉత్తరం  అందిందను కుంటాను. అన్నిఏర్పాట్లు చేసే ఉంటారనుకుంటాను__" అన్నాడు.

    ప్రొప్రయిటర్ పరిచయ పూర్వకంగానవ్వి ఒక్కసారి ఏదో పుస్తకం తిరగేసి జేబులోంచి ఒకకాగితంతీసి దానిమీద ఓ అడ్రస్ రాసిచ్చాడు.

    "పడపోదాం " అన్నాడు  శివరావునాతో.

    శివరావు మాఊరు ట్రాన్స్ ఫర్ మీద వచ్చి మూడునెలలే అయిప్పటికీ నాకుత్వరగా  సన్నీహితుడయ్యాడు. అతనికి నాకు తెలియని ఎన్నో విషయాల్లో అనుభవముంది కావడానికి నా వయసువాడే అయినా!

    శివరావు ఆ అడ్రస్ పట్టుకుని ఆ ఇంటికి చేరుకున్నాడు. ఇల్లు బాగానే ఉంది. శివరావు "వాటా మనకు కావలసిన విధంగానేఉంది. ఇందులో సులభంగా రెండు కాపురాలు నడపొచ్చు" అన్నాడు.

    ఇంటాయనకు అతను వందరూపాయలు ఇచ్చి_" టెంపరెరీగా క్యాంపుపనిమీద ఇక్కడకు వచ్చాం, ఇంత  సౌకర్యముగల ఇల్లు  దొరుకుతుందని మేమూ వినివుంటే కూడా శ్రీమతులను వెంటబెట్టుకు వచ్చిఉండేవాళ్ళం. ఈరోజే టెలిగ్రామ్ ఇస్తాం రెండుమూడు రోజుల్లో మా ఫామిలీస్ రావచ్చు " అన్నాడు.

    నేను ఆశ్చర్యంగా శివరావు మాటలు వింటూ ఊరుకున్నాను కానీ ఏమీ  మాట్లాడలేదు.

    శివరావు భార్య  ప్రస్తుతం ఏదో జబ్బుతో ఉన్నకారణంగా పుట్టింట్లో ఉంది. ఆమెకు విశ్రాంతి అవసరమనీ సాధ్యమైనంత వరకూ కొద్ది నెలలపాటు భర్తకు దూరంగా ఉండటం మంచిదనీ డాక్టర్లు చెప్పినట్లు అతనునాకు ఇదివరలో చెప్పాడు. నా విషయం సరేసరి! బ్రహ్మచారిని. ఇప్పుడు  మా ఫామిలీస్ ఎక్కణ్ణించి వస్తాయి? ఇదే సందేహాన్ని ఇంటాయన వెళ్ళిపోయాక శివరావు దగ్గర  వెలుబుచ్చాను. శివరావు జవాబుగా నవ్వేశాడు__ "ఇప్పుడు మనం అందుకే వెడుతున్నది!"

    ఈసారి ఇద్దరం మళ్ళీ ఒకకొత్త చోటుకి వెళ్ళాం. అది ఒక చిన్నగది. ఆగదిలో ఓకేఒక మనిషి ఉన్నాడు. గది ముందు మాత్రం  యాత్రీకుల సమాచార కార్యాలయం అన్న బోర్డ్ ఉంది. శివరావు అక్కడున్నతనితో__ "నా ఉత్తరం మీకు అందే  ఉంటుందనుకుంటాను__" అంటూ తనపేరూ వివరాలూ చెప్పాడు.

    ఆవ్యక్తి నవ్వి పక్కకు కదిలి అక్కడున్న బీరువాతలుపులు తీసి మూడు పుస్తకాలు మా ముందు పెట్టి__ "ఎన్నికచేసుకోండి__" అన్నాడు.

    ఆ పుస్తకాలో ఊహించిన విధంగానే ఆడవాళ్ళ ఫోటోలు ఫోటో క్రింద వారి వయస్సు ఉన్నాయి.  శివరావు నా వంకచూసి "నీకు అభ్యంతరమా__" అనడిగాడు. అతని ఉదేశ్యం  అర్ధం చేసుకున్న నేను  లేదన్నట్లుగా తలఆడించాను.

    శివరావు ఒక పుస్తకం తిరగేసి తనఎన్నిక పూర్తిచేశాడు. నేను కూడా  పుస్తకం తిరగేస్తున్నాను. కానీ నా చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. అనుకోకుండా పార్వతిని అనుభవించడం జరిగింది తప్పితే నేను  వేశ్యలకోసం ప్రాకులాడడం ఇదే మొదలు ఆ పుస్తకంలో ఉన్నఅందరూ అందంగానే ఉన్నారు. నేను చూడలేననిపించి శివరావునే నాక్కూడా ఎన్నిక చేసి పెట్టమన్నాను. అక్కడికి ఆపనీ పూర్తయింది.

    "ఏమిటి మీ బందుత్వం?" అనడిగాడావ్యక్తి.

    "భార్య! అన్నాడు శివరావు.

    ఆవ్యక్తి ఎక్కడికో ఫోన్ చేశాడు. కాస్సేపు ఆగాడు. అతని  బల్లమీది ఫోన్ అయిదు నిముషాల్లో మళ్ళీ మ్రోగింది. అతను  పెన్సల్ తో  కాగితంమీత ఏవో వివరాలు నోట్ చేసుకొని శివరావు వంకచూసి__ "సారీసార్ మరోసారి బుక్స్ తిరగేసి మరెవరినైనా సెలక్ట్ చేసుకోండి మీ కాండిడేట్ ఆల్ రడీ బుక్ అయిపోయింది__" అని నావంకచూసి _" మీనిషయంలో అంతా  రై టై పోయింది _" అన్నాడు.

    శివరావు మళ్ళీ పుస్తకాలు తిరిగేయడం మొదలుపెట్టాడు. రెండుపుస్తకాలు చూసి అతను చిరాగా __"బోర్ గా ఉంది__" అన్నాడు. అప్పుడు నేను__" నాకండిడెట్ నీకు నచ్చిందిగదా ఏలాగు నాకు అంత ఆసక్తి లేదనుకో -" అన్నాను.

    "కంగారుపడకు మిత్రమా! ఇంకా ఒక పుస్తకముంది మూడువారాలిక్కడ గడపవలసిన  అవసరముంది. నాగురించి నువ్వే కాస్త సెలక్షన్ చేసి పెడుతూ_" అన్నాడు.

    మూడవ పుస్తకం  మొదటి పేజీలోనే కళ్ళుజిగేల్ మనిపించే అందంకనపడగా శివరావుకు చూపించాను. "ఫెంటాస్టిక్" అన్నాడు శివరావు. ఆ వ్యక్తి మళ్ళీ ఫోన్ చేశాడు. ఈసారి అన్నీ సరి అయ్యాయి__"రేపు సాయంత్రం అయిదు  గంటలకు__" అన్నాడతను.

          
    ఉమ, నేనూ సినిమా ధియేటర్ లో ఉన్నాం. శివరావు శాంతతో ఎక్కడికో  పోయాడు. ప్రస్తుతం ఉమ ఇక్కడ నాకు భార్యగా  వ్యవహరించబడుతోంది.

    సినిమాకు ఇంటర్వల్ వచ్చింది. లైట్లు వెలిగాయి. నేనూ, ఉమా ఏవో కబుర్లు చెప్పుకుంటున్నాం. హఠాత్తుగా  "హలో సుజాతా "అన్న పిలుపువినబడి ఇద్దరం ఉలిక్కిపడ్డాం. ఒకయువకుడు మావైపే వస్తున్నాడు.

    "ఎవరండీ మీరు__"అనడిగాను ఆశ్చర్యంగా.

    అతను నాప్రశ్న వినకుండా ఉమవంకే గుచ్చి గుచ్చి చూస్తూ_"సుజాతా నువ్వు  ఇక్కడ?" అన్నాడు. ఉమా మాట్లాడలేదు.

    నేను ఆ యువకుణ్ణి చూస్తూ మళ్ళీ__"ఈమె పేరు ఉమ. మీరంటున్న సుజాత ఎవరో మాకు తెలియదు_" అన్నాను.