Facebook Twitter
హెల్ టవర్

"హెల్" టవర్

 



పక్షుల్ని వేటాడే తుపాకీ లేకపోయినా
జేబులో బుల్లి మారణాయుధంతో
ఇప్పుడంతా హంతకులే!!

హైవేల కోసం విశాల హృదయంతో
చెరువులు, వ్రుక్షాల త్యాగాలు
హెల్ టవర్ ప్రకంపనాలకు
బుజ్జిపిట్టల హాహాకారాలు వినండి
వందల వేల పిట్టల శవాలు చూడండి
మానవ కాలుష్యానికి ముక్కులు బెదిరి
రెక్కలు చాపి ఎగిరిపోయే
వలస పక్షుల విలవిలలు వినండి..
మన చూర్లలో పిచ్చుకలు లేకపోతేనేం
తలల మీద లోహ విహంగాలున్నాయి కదా !!
అడవులు లేకపోతేనేం
రోడ్ల సర్ప పరిష్వంగాలున్నాయి కదా!!
ప్రకృతి పారిపోతేనేం
వికృతంగా మనం బతికున్నాం కదా!!
మనిషికి దూరంగా ప్రకృతి ఒడిలోకి
పారిపోయి పరవశించే పిట్టల్ని
హెల్ టవర్ నీడల్ని ఇంకా ఇంకా విస్తరిస్తూ
తరుముదాం... తనదాకా వచ్చేదాకా...


- సి. భావానీ దేవి