Facebook Twitter
నా చెలి పారాణి పాదాలు

నా చెలి పారాణి పాదాలు

- ఇల్లిందల పద్మా శ్రీనివాస్

నా చెలి పారాణి పాదాలు ఆ నేల తాకే వేళ
ఆనందాల ఆకాశం నీలి రంగుల కాంతులై
నా చెలి మోము తాకుతూ
తన నీలి కురులలో తారాజాబిలి
తారాట్లాడుతూ నా చెలి నన్ను చేరి
ఓ కౌగిలి ఇస్తే
ఆ రోజు మరువలేని ఓ తీపి గుర్తు

నా  కళ్ళలో నీ రూపం కదలాడుతూ ఉంటే
రెప్పయినా వేయను నేను
ఎందుకంటే
ఎక్కడ నీ రూపం కరిగిపోతుందో అని భయం

ఎడారిలో ఒయాసిస్సులా ఉండేనాలో
వలపుల వానలు చిలికి
చిరునవ్వుల పూలు పూయించే నీకు
ఏమిచ్చి రుణం తీర్చుకోను
నీలో సగమయితే తప్ప

నింగినేల ఉన్నంత కాలం మన ప్రేమ ఉంటుంది
ఎందుకంటే వాటిలాగే ఇప్పటికి మనం కూడా కలవలేం

కానీ నీకు తెలుసా? నీలా నింగి వాన కురిపిస్తేనే
నాలా నేల పులకరిస్తుంది.
ఈ జన్మకు ఈ బంధం చాలు