Facebook Twitter
నోరు నవ్వు ఏం చెబుతున్నాయి

నోరు నవ్వు ఏం చెబుతున్నాయి

- పార్ట్ - 2

- స్వప్న కంఠంనేని

తెరుచుకున్న పెదాలు :

ఎదుటి మనషి మాట్లాడుతున్నపుడు ఒక వ్యక్తి నోరు తెరచుకుని వింటున్నాడనుకోండి. అప్పుడు?

* అతను  హృదయాన్ని విప్పి వింటున్నాడని అవతలి మనిషి చెప్పే  వాటిని నమ్ముతున్నాడనీ, వినాలనే తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నడనీ అనుకోవాలి.

* తన చుట్టూ తిరిగే  పురుషుడు తన చెప్పే  విషయాన్నీ ఇలా పెదాలు తెరచుకుని  ఆమె అతను పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నాడని తన గురించి ఇంకా తెలుసుకోవాలని చూస్తున్నాడని అనుకోవాలి.

బిగుసుకున్న పెదాలు :

హమేషా పెదాల్ని బిగించి ఉంచే పెద్దమనిషికి మనసులో అనేక అభిప్రాయాలూన్నాయనీ అతడు వాటి గురిచి చెప్పకుండా దాచుకుంటున్నడని అనుకోవాలి.
* ఇలాంటి మనుషులు లోలోపల ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉద్వేగాలతో ఎప్పుడు అగ్నిపర్వతం బద్దలవుతుందా అన్నట్లుంటారు. వీళ్ళు

మానసిక  ఒత్తిడితో నలిగిపోతు తలనొప్పులు, ఆల్సర్ మొదలైన వాటితో భాదపడే అవకాశం ఉంది.

పెదిమల కొనలు పైకి లేచి:


* ఇలాంటి వ్యక్తి ప్రతీ విషయాన్ని ఆశ అనే భూతద్దంలోంచి చూసే ఆశావాది అయివుంటాడు.
* ఇతడిలో స్వతహా సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. ఇతను ఎదుటి వాళ్ళను కూడా చలాకీగా నవ్వులలో ముంచగలుగుతాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని చేసుకునే అమ్మాయి మహా బాగా సుఖ పడిపోగలుగుతుంది.

దీనికి పూర్తి విరుద్దం గా వ్యక్తి పెదిమల కొనలు కిందికి వాలిపోయి వుండే మనిషి..

* లోకంలో ఇలాంటి వాళ్ళే అధికంగా ఉండటం విచారకరం! లోకం తో విసుగు చెంది గొప్ప నిరాశావాదులు అయివుంటారు.
* ఇలాంటి వ్యక్తి కాన్ఫిడెన్స్ ను పొందటం కష్టం అలా  పొందగలిగిన స్త్రీ ని మాత్రం అతను నెత్తి మీద పెట్టి చూసుకుంటాడు.

పెదిమలు తడుపుతూ :

ఇతను మంచి సరసుడై వుంటాడు ఇందులో కూడా కొన్ని పద్దతున్నాయి. నాలుకను  చకచక వెనక్కు ముందుకు ఆడించడం.  నాలుకను  పెదిమల మధ్య నిధానంగా ఈ చివరి నుండి ఆ చివరికు కదిలించడం. ఇవి కొంచం ఎబెట్టు చేష్టలు సంస్కారవతి  అతని పట్ల ఇష్టం లేకపోతే  అవమానం ఫీల్ అవుతుంది.

వణికే పెదాలు :

* మాటి మాటికి  ఇలాంటి స్థితిలో లో ఉండే  పురుషుణ్ణి   స్త్రీ తట్టుకోవడం  కొంచం కష్టమే అయితే ఆమె అతనిని ఒక తల్లిలా గురువులా, బుజ్జగించగలిగితే  అద్భుత విజయాన్ని సాధించగలుగుతుంది.

ఇవి కాకుండా మరికొన్ని భావాల్ని వ్యక్తికరించే మొహల గురించి వచ్చేవారం తెల్సుకుందాం....