Facebook Twitter
తల్లివేదన (కవిత)

తల్లివేదన (కవిత)

 

 

 

కన్నావ్..!పెంచావ్..!సాకావ్..!!
పస్తుల్..!ఉన్నావ్..!పుస్తెల్..అమ్మావ్..!!
కొడుకు బాగుకోసం..
నీరక్త మాంసాన్ని కరగతీసావ్..!!
రోడ్డు మీద పడ్డావ్..మూలుగుతున్నావ్..!!

నడక నేర్పావ్..!బువ్వ తినిపించావ్..!!
అన్నీ నీవై..!అపురూపంగా చూసుకున్నావ్..!!
ఏమైంది..??? నడవలేవ్..!తినలేవ్..!!
కాలకృత్యములు తీర్చుకోలేవ్..!!
జీవముండగానే శ్మశానపాలయ్యావ్..!!

ఈగల్..! దోస్తుల్..!!
వృక్షముల్..! నీడల్..!!
మట్టే..! నీకుభోజనముల్..!!
నీకట్టే..! కాలేవరకుల్..!!
అడ్డ్కునే శక్తిలేదు..!!
ఉన్నది తిందామంటే..!!
కరముల్..!నోటి వరకు రావట్లేదు..!!
కీళ్ళు విరిగాయి..! కాళ్ళు పడిపోయాయి..!!
జీవం దేహం వీడదు..!!
ఇంకా..ఎంతనరకం చూడాలో మరి..!!
ఈ పాపం ఎవరిది..!!
ఆ పిచ్చితల్లిని శ్మశానం చేర్చిన..!!
పోరంబోకు నాయల్ది ..!!
ఒరే..!!! నీ గతి ఇంతకన్న దుర్లభం..!!
గుర్తుంచుకో..!!
తల్లిని బాధపెట్టినోడు బాగుపడడు..!!