Facebook Twitter
ఒలికిమిట్టలో ఒట్టు

ఒలికిమిట్టలో ఒట్టు

 

ఓ ప్రియా నీ కరతలము నా కరముతో బంధించి  ఒలికిమిట్టలో ఉన్న క్రతుధ్వంసి సాక్షిగా చెప్తున్న ...!!!  

నీలో నేనే..!!

నాలో నీవే..!!

నీకు నేనే..!!

నాకు నీవే..!!

నా డెందము నీదే..!!

నీ సత్వము నాదే..!!

నా స్వాంత స్వరము నీకే..!!

నీ తురంగ స్వరాగాలు నా కొరకే ..!!

నీ కక్కసములో నీడనై..!!

నీ కౌతుకములో తోడునై..!!  

నీ విజితిలో కారకుడినై..!!

నీ హ్వాలములో నేతోడై..!!  

నీ హస్తము నే వదలను ఓ అఖిలనేత్రి ..!!

నీవే నా జీవనం..!!

నీవే నా మననం ..!!

నీవే నా గమనం..!!

నీవే నా ఆశయ గగనం ..!!

నీవే నా ప్రాణం..!!

నీవే నా అపానం..!!

నీవె నా వ్యానం..!!

నీవే నా ఉదానం..!!

నీవే నా సమానం..!!

నా ఆది నీవే..!!

నా అంతం నీవే..!!

నా అనంతం నీవే..!!

నీవే...నీవే నా అంతట నీవే..!!

నా ఇహ యందు నీవే..!!

నా పర యందు నీవే..!!

నేనంత్త నీవే..!!

నీవెంత్త నేనే..!!

నంతాయు నీవే..!!

నా మతిలో అలోచన..!!

నా లోచనాల మధుర కలా సులోచన..!!

నా సుమదిలో నీవే కదా ఓ లలన ..!!

నిన్నే దాచను నా హృదయ మందిరాన ..!!

ఈ జన్మలోనే కాదు..!!

మరు జన్మలో అయినా..!!

ఆ మరో జన్మలో అయినా..!!

జన్మ జన్మల నేనే నీ ప్రాణా సఖుడిని ఓ అఖిలం..!!

-జాని.తక్కెడశిల