Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అరుంధతీ సుబ్రమణ్యం

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అరుంధతీ సుబ్రమణ్యం

అరుంధతీ కవిత్వంలో ఆధ్యాత్మికత, తాత్విక చింతన, సంస్కృతి కవితా వస్తువులు. నిజానికి ఆమె దేనినైనా కవిత్వం చెయ్యగలదు. రెండు భిన్న అంశాలని తాత్వికంగా ముడిపెట్టగల నేర్పు ఆమె సొంతం. ఆమె మూడు కవితా సంకలనాలు రాసింది. రెండు పుస్తకాలు ఒకటి బుద్ధుడి మీదా ఇంకొకటి Sadguru: More than a Life అనే పుస్తకమూ రాసింది. ఆమె రచనల్లో ప్రతిభకి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు వచ్చాయి. ప్రపంచమంతా ఎన్నో Literary conferences లో ఆమె పాల్గొంది. ఎన్నో ఇతర భాషల్లోకి ఆమె కవిత్వం అనువాదం చేయబడింది.

మచ్చుకి ఈ కవిత చూడండి. కింద దాని తెలుగు అనువాదం చేసిన కవిత ఇచ్చాను.

Prayer

May things stay the way they are
in the simplest place you know.

May the shuttered windows
keep the air as cool as bottled jasmine.
May you never forget to listen
to the crumpled whisper of sheets
that mould themselves to your sleeping form.
May the pillows always be silvered
with cat-down and the muted percussion
of a lover’s breath.
May the murmur of the wall clock
continue to decree that your providence
run ten minutes slow.

May nothing be disturbed
in the simplest place you know
for it is here in the foetal hush
that blueprints dissolve
and poems begin,
and faith spreads like the hum of crickets,
faith in a time
when maps shall fade,
nostalgia cease
and the vigil end.

ప్రేయర్

నీకు తెలిసిన ప్రతి చోటా
ఎలా ఉన్న వస్తువులు అలానే ఉండనీ

సీసాలో నింపిన మల్లెల పరిమళంలాగా
మూసిన కిటికీలు గాలినలాగే ఉంచనీ చల్లగా.

పడుకున్నప్పటి శరీరాకృతి ప్రకారమున్న
దుప్పటి ముడతల గుసగుసలు
వినడమూ మరువకు.

తలగడలనెప్పటికీ ఉండనీ
మెత్తని ఊలు వెండి వర్ణంతోనూ
ఓ ప్రేమికుడి మౌనమైన శ్వాస ప్రకంపనలతోనూ.

నీ గమనమొక పదినిముషాలాలస్యంగా సాగుతున్నదని
గోడమీద గడియారం గొణుగుతూ
తీర్పు చెప్తూనే ఉండనీ.

నీకు తెలిసిన ఏచోటునుంచీ
దేనినీ చెదరనీయవద్దు
ఎందుకంటే, ఇక్కడే, ఈ నిశ్శబ్ద గర్భస్థ కుహరంలోనే
నమూనాలు కరిగి
ఇంక సృజన మొదలవుతుంది
విశ్వాసం కీచురాళ్ళ రొదలా వ్యాపిస్తుంది.
నమ్మకం ఇటువంటి ఓ కాలంలో --
అంటే ఎప్పుడు సరిహద్దు రేఖలు చెరిగిపోతాయో,
గతస్మృతులు కరిగిపోతాయో,
మరి జాగరూకత ముగుస్తుందో అప్పుడు.

ప్రేయర్ అనే ఈ పోయెంలో ప్రార్ధన అంటే దేముడ్ని ఏవేవో కోరికలతో ప్రార్ధించటం కాదనిపించింది. ఎలా ఉన్న దాన్ని అలానే ఉంచి, అంటే ఏదీ కూడా ఇలానో, అలానో మారాలి మార్చాలి అని అనుకోకుండా, ఎందుకంటే ఏదైనా మారాలి మార్చాలి అంటే అది ఒక ఇమోషనల్ టెర్రరిజం అవుతుంది (ఇది మనం చూస్తూనే ఉన్నామీ రోజుల్లో) . ఎక్కడివక్కడే ఉన్నపుడు వ్యాపించి ఉండేది ఒక నిశ్శబ్దం, నిర్వేదం. నీ విధిలో నీ గమనంలో నువ్వొక పది నిముషాలు లేటని గడియారం గొణిగినా పట్టించుకోవద్దంటుంది. ఇలాంటి నిశ్శబ్దాన్ని ఛేదించినప్పుడు, భేదించినప్పుడు ఆ నిశ్శబ్దపు గర్భంలోంచి ఒక పిండం జీవం పోసుకుంటుంది. అది కవిత కావచ్చు. విప్లవమూ కావచ్చు. ఆ సమయంలో దేనికీ సరిహద్దు రేఖలుండవు, గత స్మృతులుండవు, వాటి తాలూకూ వైషమ్యాలూ శతృత్వాలూ ఉండవు, ఒక్క నమ్మకం మాత్రముంటుంది. ఆ నమ్మకమే, విశ్వాసమే, వ్యాపిస్తుంది. నిజానికి మనం గమనిస్తే కీచురాళ్ళు మామూలుగా రాత్రిళ్ళు ఎక్కువ రొద పెడతాయి పైగా అన్నీ ఒక్కసారే అందుకుని ఒక్కసారే ఆపేస్తుంటాయి. ఒక ఏకత్వం, ఏకమైన తత్వం కనిపిస్తుంది. నిజానికి కీచురాళ్ళు పెద్దగా పట్టించుకోవాల్సిన ప్రాణులేం కావు, పెద్దగా హానీ చెయ్యలేవు. కానీ రాత్రి సర్వ జగత్తూ జాగరూకత లేకుండా, అంటే తమని తాము రక్షించుకునే ఆలోచనలేకుండా ఉండే సమయం వాటిదే. ఆ సమయంలో ఇంకే చప్పుళ్ళూ ఉండవు, అన్నీ నిద్రావస్థలోనే ఉంటాయి. కాబట్టి కీచురాళ్ళదే స్వరం, వాటిదే రాజ్యం. ఎటువంటి అసహజత్వమూ లేనపుడు ఒక సహజత్వం పుడుతుంది అది స్వఛ్చంగా ఉంటుంది.

ఇంకొక రకంగా ఆలోచిస్తే మనని మనం మరచి, మన దేహం, దాని రక్షణ, సమ్రక్షణ గురించీ ఆలోచించకుండా, గతాన్ని మరిచి, కోరికలేమీ లేకుండా, సరిహద్దు రేఖలేవీ లేని స్వేఛ్చలో, ఉండటమే ఒక రకమైన ప్రేయర్ కదూ.


Home

Give me a home
that isn't mine,
where I can slip in and out of rooms
without a trace,
never worrying
about the plumbing,
the colour of the curtains,
the cacophony of books by the bedside.

A home that I can wear lightly,
where the rooms aren't clogged
with yesterday's conversations,
where the self doesn't bloat
to fill in the crevices.

A home, like this body,
so alien when I try to belong,
so hospitable
when I decide I'm just visiting.

***

ఇల్లు

నాది కానిదొకటి
నాకొక ఇల్లు ఇవ్వండి

ఎటువంటి ఆనవాళ్ళు వదలకుండా
ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్తూ
ప్లంబింగ్ గురించిగానీ
కర్టెను కలరు గురించి గానీ
మంచం ప్రక్కన పుస్తకాలు చేసే రొద గురించి గానీ
అస్సలు ఆందోళన పడకుండా

తేలికగా చూసుకోగల్గే ఒక ఇల్లు
ఎక్కడ నిన్నటి సంభాషణలు
గదుల్లో నిండి ఉండవో
ఎక్కడ తెగ పెరిగిన అహం
ఖాళీలనన్నీ నింపదో

ఒక ఇల్లు, ఈ దేహంలాంటిది
నే సొంతం చేసుకోవాలంటే పరాయిగానూ
అతిధిలా వస్తానంటే
ఆహ్వానించేదిగానూ.

సొంత ఇల్లంటే ఎంతో బాధ్యత. కరెంటు, వాటరు, ఇంట్లోని వస్తువులు, కొళాయిలు అన్నీ సక్రమంగా పనిచేసినపుడే ఆ ఇల్లు వసతిగా సౌకర్యంగా ఉంటుంది. సౌకర్యంగా ఉండాలంటే ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండవలసిందే. నిజానికి ఇవన్నీ ఉన్నా కొన్ని బాధించే విషయాలుంటాయి. ఆ ఇంట్లోని కొన్ని చేదు అనుభవాలు, చేదు మాటలు, వాదులాటలు, అవమానాలు, సంఘర్షణలు ఇవన్నీ జ్ఞాపకాలై ఇంట్లోని కొన్ని వస్తువులు, పరిస్తితులు గుర్తుతెచ్చి బాధపెడుతూ ఉంటాయి ఎంత వద్దనుకున్నా. మరి సౌకర్యంగా ఉండే ఇంట్లో ఇలాంటి జ్ఞాపకాలుండకపోతే ఇంకా బాగుంటుంది కదా.

చివరి లైన్లు కవితకి హై లైటు. ఆత్మ ఒక దేహాన్ని తొడుక్కుంటుంది, మరణంతో దాన్ని విడిచిపెడుతుందని మన వేదాంతం చెప్తుంది. ముసలితనంలో కృశించి, మరణంతో నశించే ఈ దేహం నాదనుకోవడం, అతిగా ప్రేమించడం రెండూ వృధానే. ఇల్లంటే ఎలా వుండాలో చెప్తూ కవితకి ఒక తాత్విక ముగింపు ఇస్తుంది. దేహాన్ని సొంతం చేసుకోవాలంటే పరాయిదౌతుంది, అలాగే జస్ట్ అతిధిలా ఉండి వెల్తానంటే మాత్రం ఆహ్వానిస్తుంది. నిజానికి అతిధిలా ఉంటే దేని గురించి వర్రీ అవక్కర్లేదు. అశాశ్వతమైన బ్రతుకులో దేని మీదా సొంతమన్న భావం ఉండకపోవడం ఏంటో ఈ కవిత ముగింపులో అందంగా చెప్తుంది.

Andheri Local అనే ఒక పోయెంలో చివరగా అంటుంది ట్రైన్ దిగాకా నేను కారట్ ముక్కలు చెయ్యాలా, లేదా ప్రేమికుడిని ముక్కలు చెయ్యాలా అనే రెండు చాయిస్లలో ప్రేమికుడిని చాప్ చెయ్యడం పోస్ట్పోన్ చేస్తానంటుంది. నిజమే మరి ముంబాయి లోకల్లో లేడీస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తేనే గాని తెలియదు. అది లక్ష నాలుకల, అనేక మొగుళ్ళ కాళిక పట్టాలపై అంటుంది సటైరికల్గా.

When I descend
I could choose
to dice carrots
or a lover
I postpone the latter.


ఈరోజుల్లో ఏ కవికైనా అచ్చంగా ఒక ప్రాంతానికీ, ఒక వాతావరణానికీ, ఒక మతానికీ,ఒక సంస్కృతికి చెంది ఉండటం అనేది కష్టం. ఎందుకంటే మొత్తం గ్లోబ్ ఒక విలేజ్అన్నట్టుగానే జీవితం నడుస్తోంది. ఇంటర్నెట్టూ , సమాచారం సులువుగా ప్రవహించడం వల్ల దూరం అనేది తగ్గిపోయింది. అలాగే భిన్న సంస్కృతుల మధ్య దూరం కూడా తగ్గిపోతూ వస్తోంది. ముడుచుక్కూర్చోకపోతే అన్ని పండగలూ మనవే అన్నట్టుంటున్నాయి. ఇక పల్లెలూ పల్లె జీవితమూ కనుమరుగవుతూ, ప్రతి కుటుంబం నుంచి ఒకరో ఇద్దరో పిల్లలు విదేశాలకెళ్ళడం , జీవన సరళి, పట్నాలూ, మెట్రోలూ అయితే అవి గ్లోబల్ విలేజెస్ గానే ఉంటున్నాయి తప్పించి, వాటి అసలు స్వరూపం రూపు రేఖలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఈ నగరాల్లో పెరిగినవారు, తమిళులైనా, తెలుగువారైనా, వేరే ఇతర రాష్త్రాల వారైనా వారి వారి సాంప్రదాయాలతో బాటుగా ఇతరుల సాంప్రదాయాలనూ కొంత చేర్చుకుని ఒక కొత్త ప్రపంచ సిటిజెన్స్ గా తయారవుతున్నారు. ఇది ఒక అనివార్య పరిణామమే, తప్పదు. మరి చాందసవాదులు వీరినీ వీరి భాషనూ, వీరి మూలాల్నీ ప్రశ్నిస్తే వారి జవాబేంటి.

తన జవాబుని To Welsh Critic Who Doesn'T Find Me Identifiably Indian అనే కవితలో ఇస్తుంది.
నేను ఆమె ఇంగ్లీష్ పోయెంలో కొంత భాగాన్ని పేస్ట్ చేసాను అనువాదం చేసి.

“This business about language,
how much of it is mine,
how much yours,
how much from the mind,
how much from the gut,
how much is too little,
how much too much,
how much from the salon,
how much from the slum,
how I say verisimilitude,
how I say Brihadaranyaka,
how I say vaazhapazham –
it’s all yours to measure,
the pathology of my breath,
the halitosis of gender,
my homogenised plosives
about as rustic
as a mouth-freshened global village.

Arbiter of identity,
remake me as you will.
Write me a new alphabet of danger,
a new patois to match
the Chola bronze of my skin.
Teach me how to come of age
in a literature you’ve bark-scratched
into scripture.
Smear my consonants
with cow-dung and turmeric and godhuli.
Pity me, sweating,
rancid, on the other side of the counter.
Stamp my papers,
lease me a new anxiety,
grant me a visa
to the country of my birth.
Teach me how to belong,
the way you do,
on every page of world history. “

"ఈ భాషా వ్యాపారంలో
ఎంత నాది,
ఎంత నీది
ఎంత మెదడులోంచి
ఎంత కడుపులోంచి
ఎంత మరీ తక్కువ
ఎంత మరీ ఎక్కువ
ఎంత మంగలి అంగడి నించి
ఎంత బస్తీ నుంచి
యదార్ధము అనే పదమెలా పలుకుతాను
బృహదారణ్యక అనే పదమెలా పలుకుతాను
వారపరం (తమిల్) ఎలా పలుకుతాను
ఈ కొలతంతా నీదే
నా శ్వాస రోగ నిర్ధారణ
స్త్రీపురుష లింగ దుర్గంధం
నా సజాతీయం చేసిన విస్పోటనలు
నా శ్వాస రోగ నిర్ధారణ
స్త్రీపురుష లింగ దుర్గంధం
నా సజాతీయం చేసిన విస్పోటనలు
మౌత్ ఫ్రెషెనర్ వేస్కున్న గ్లోబల్ విలేజ్
ఎంత పల్లెటూరో అంత
మధ్యవర్తిగా నా ఉనికిని
నీ ఇష్ట ప్రకారం తిరిగి తయారుచేయ్యి
నాకొక అపాయపు అక్షరాన్ని రాసివ్వు
చోళుల ఇత్తడి లాంటి నా ఒంటి రంగుకి
నప్పే ఒక కొత్త మాండలికం.
శాస్త్రాలుగా
నువు గిరికిపారేసిన సాహిత్యంలో
సమకాలీనంగా ఎలా ఉండాలో నేర్పు
గోధూళి, పసుపు,గోమేయం
పూయి నా సమ్యుక్తాక్షరాలకి.
ఎదురుగా నిలబడి కుళ్ళి
చెమటతోనున్న నాపై జాలిపడు
నాకొక కొత్త ఆందోళన బదులివ్వు
నా కాయితాలపై ముద్ర వెయ్యి
నేను పుట్టిన నా దేశానికి
నాకు వీసా ఇప్పించు
దేశవాసిగా ఎలా ఉండాలో నేర్పు
ప్రతి ప్రపంచ చరిత్ర పేజీపై
నువు చేసే విధంగా.”

చక్కని జవాబు కదూ. మీక్కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

- Sharada Sivapurapu