Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అనితా నాయిర్

 

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? అనితా నాయిర్

 

అనితా నాయిర్ మొదట Satyr of the Subway ఇంకా పదకొండు కధలూ మొదట రాసింది. తరవాత ఆమె రాసిన 15 నవలల్లో The Betterman, Ladies Coupe, Mistress అనే మూడు నవలలు ముఖ్యమైనవి. ఆమె మొదటి కవితా సంకలనం Malabar Mind, Where is the Rain Born కేరళ గురించిన రచనలు. ఇవి కాకుండా ఎన్నో కధలు పిల్లల కోసం రాసింది. ఆమె రచనలు 30 ఇతర భాషల్లోకి అనువదించారట. ఇక ఎవార్డ్స్ విషయానికొస్తే కొదవ లేదు. కేరళ సాహిత్య ఎకాడమీ ఎవార్డు ముఖ్యమైనది. ఆమె నవలలు కూడా అన్నీ బెస్ట్ సెల్లర్సే. ఆమె ఫేస్ బుక్ పేజీ లో ఒక కవిత ఈమధ్య కాలంలో జరుగుతున్న విషయాల గురించి, వీస్తున్న గాలులకి స్పందనగా రాసింది దొరికింది, ఒక కవి ఏంచేస్తాడు, తన స్పందన తెలపడం తప్ప దేశంలో ఇలాంటివన్నీ జరుగుతున్నపుడు అని వ్యాఖ్యానిస్తూ ఈ కవితకి ముందు. నాకు నచ్చింది. మీకూ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ కవితకి తెలుగు అనువాదం కింద ఇస్తున్నాను.

Said-ition, Sedition, Whatever.


Look young man
We don't care who you are
We don't care what you said
It's enough you asked a question
Actually you asked several, they said.
So that's said-ition, sedition, whatever.
We dont like dissent.
Actually we don't like Dalits,
Muslims, women breaking our rules,
University students, human rights.
But that's not for you to say.
So that's said-ition, sedition, whatever.
There is only one divinity
What we know; there is only one right
A khaki coloured kumkum scented right.
So your martyrs day is our murderer's day.
The constitution and tri-color aren't right.
But that isn't said-ition, sedition, whatever.
We have the power of om and the goons.
Saffron to brandish, god men as spin doctors.
So we will clamp your voice
Break your spirit and steal your breath.
We will tell you what is to be said.
Or pay dog for said-ition, sedition, whatever.

 


Said-ition, Sedition, Whatever.

చూడు కుర్రాడా
నువ్వెవరో మాకక్కరలేదు
నువో ప్రశ్న అడిగావు, అది చాలు మాకు
నిజానికి నువు చాలా ప్రశ్నలడిగావని వాళ్ళన్నారు,
అందుకని అది said-ition, sedition, whatever

మాకు నిరసన ఇష్టం ఉండదు.
నిజానికి దళితులంటే మాకిష్టం లేదు.
ముస్లింలూ, సాంప్రదాయాలకు విరుద్ధంగా వెళ్ళే ఆడవాళ్ళూ
మానవ హక్కులూ, విశ్వ విద్యాలయాల విద్యార్ధులూ
కానీ ఇవన్నీ నువు కాదు చెప్పాల్సింది
అందుకని అది said-ition, sedition, whatever

ఒకే ఒక దైవం ఉంది
మాకు తెలిసి: ఒకటే సవ్యం
ఒక ఖాకి రంగు, సువాసన కుంకుమ సవ్యం
మీ అమర వీరుల దినం మా హంతకుల దినం
త్రివర్ణ పతాకం, రాజ్యాంగంతో సహా అపసవ్యమే
అందుకని అది said-ition, sedition, whatever

రౌడీ బలగం, ఓం శక్తి మాకుంది
చిట్కా వైద్యానికి దైవ సమాన బాబాలు, ఝళిపించడానికి కాషాయం
అందుకని నీ గొంతుక మేం నొక్కేస్తాం
అంతరాత్మని ముక్కలు చేయ్, నీ ఊపిరి హరించు
నువ్వేం చెప్పాలో మేం చెప్తాం
లేదంటే జరిమానా కట్టు for said-ition, sedition, whatever.

**

సమకాలీన పరిస్తితులకి అద్దం పట్టే కవిత. వివరణ అవసరం లేని కవిత.


Ministry of Deceit


Was it a Sunday evening
When you left a window carelessly open
You rang first that gong of betrayal?
Was it one high noon
When you thoughtlessly fed her bones of the lamb
You sang first that litany of duplicity?
Was it under a moonlit sky
When your face flowered in surreptitious joy
You knew first that triumph of transgression?
Was it under a kitchen light
As you lay bare fish bones of guilt
You exorcised first imprudent trust?
A Saturday, a Monday,
Pearly light, yellow light, in the dark
Eighty-six thousand four hundred ways exist.
To baptize the fool
Smug in the knowledge
She will never be deceived.
Halleluiah


Ministry of Deceit

నిర్లక్ష్యంగా కిటికీని తెరిచి వెళ్ళిపోయి
ద్రోహపు గంట మొదటిసారిగా మోగించినది
ఒకాదివారపు సాయంత్రమేనా?

ఆలోచనారహితంగా గొర్రె మాంసంలోని ఎముకలనామెకు తినిపించి
నువ్వో మోసపు కీర్తన పాడినది
అదొక మిట్టమధ్యాహ్నపు వేళ కదూ?

ఉల్లంఘన విజయాన్ని నువు చవిచూసినపుడు
నీ మోముపై వికసించిన కృత్రిమానందం
అది వెన్నెల పరుచుకున్న ఆకాశం కిందనే కదూ?

అపరాధపు చేప ఎముకలని పరిచి
అవివేకపు నమ్మకాన్ని పారద్రోలినది
వంటింటి వెలుతురులోనే కదూ?

ఒక శనివారం, ఒక సోమవారం
తెల్లని ముత్యాల వెలుగు, పచ్చని వెలుతురు, చీకట్లో
ఎనభైయ్యారు వేల నాల్గొందల మార్గాలున్నాయి

నన్నెవరూ ఎప్పటికీ మోసగించలేరనుకుని
భ్రమపడే ఓ మూర్ఖురాలిని
బాప్తీజించడానికి

హల్లలూయా.

ఈ కవిత తన భర్త మీద అపారమైన నమ్మకం ఉన్న ఓ స్త్రీ గురించి. మనం Home Ministry అని గృహిణిని అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ డిసీట్ అనే శీర్షిక మోసం చేసే భర్త నుద్దేశించి పెట్టినట్ట్లు అనిపించింది. కళ్ళు తెరుచుకుని గమనిస్తే భర్త / ప్రేమికుడు మోసం చేస్తున్నాడని క్లియర్గా తెలుస్తుంది. ఆమె ఉదహరించినవన్నీ అతను దారి మార్చుకుంటున్నాడనటానికి సంకేతాలు గమనిస్తే. నన్నెవరూ మోసం చెయ్యలేరనే ఒక ధైర్యంతో మూర్ఖంగా ఉండిపోతే వారిని బాప్టైస్ చెయ్యడానికి ఎన్నో వేల మార్గాలున్నాయంటుంది. అపరాధపు చేప ఎముకలు పరిచి, అవివేకంగా పెంచుకున్న నమ్మకమనే ఆత్మని పారద్రోలాడట. మామూలుగా ఎముకలు పరిచి మంత్రాలు చదివి మనుషులకి పట్టిన చెడ్డ ఆత్మలని వదిలిస్తారు. కానీ ఇతను ఆమెకు అతనిపై ఉన్న నమ్మకాన్ని వదిలించేసాడు. అదీ సంగతి.

ఇక అనితా నాయిర్ నవలలకొస్తే ఆమె స్త్రీ పురుష సంబంధాల్ని అత్యద్భుతంగా చిత్రిస్తుంది ఆమె స్త్రీ పాత్రలు ఎన్ని కష్టాలు పడ్డా, తిరిగి తిరిగి మొదటికే వచ్చినా మళ్ళీ అక్కడినుంచే పైకి లేచే ప్రయత్నం చేస్తాయి అన్ని నవలల్లోనూ. ప్రేమ, మోసం, భంగపాటు ఇవన్నీ ఎదుర్కొని మళ్ళీ మళ్ళీ జీవితాన్ని వెతుక్కుంటూ సాగించే పయనాలే.

 

- Sharada Sivapurapu