Home » SMS » నువ్వు నవ్వావని



Facebook Twitter Google
నువ్వు నవ్వావని

నువ్వు నవ్వావని

నిశియంతా వెలుగైతే తెలిసింది నువ్వు నవ్వావని
వనమంతా విరులైతే  తెలిసింది నువ్వు నవ్వావని

తనువంతా తడియైతే తెలిసింది నువ్వు తాకావని
కలతంతా  సుఖమైతే తెలిసింది నువ్వు నవ్వావని

మనసంతా చెమరిస్తే తెలిసింది నువ్వు చూసావని
ఎదలోనే  రవమైతే  తెలిసింది నువ్వు నవ్వావని

ధరయంతా దివియైతే తెలిసింది నువ్వు ఉన్నావని
వరమేదో వశమైతే తెలిసింది నువ్వు నవ్వావని

#నెలరాజా కనిపిస్తే  తెలిసింది నువ్వు నవ్వావని
మధురంగా సడియైతే తెలిసింది నువ్వు నవ్వావని   ... @శ్రీ

ఎందుకిలా చేశావు
Apr 1, 2015
రాగాలు తీస్తున్న హృదయం
Mar 26, 2015
నీకోసం
Feb 22, 2015
శాంతి
Feb 20, 2015
జీవనమార్గం
Feb 18, 2015
ప్రేమంటే...
Feb 11, 2015
స్వేచ్ఛే నా చిరునామా...
Jan 21, 2015
జ్ఞాపకం...
Jan 2, 2015
నువ్వు మరిచాక..
Dec 18, 2014
చెట్టు నుంచి...ఒక ఆకులా
Nov 20, 2014
TeluguOne For Your Business
About TeluguOne