Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సుగాధా కుమారి మలయాళం

 

మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సుగాధా కుమారి మలయాళం

 


సుగాధా కుమారి 1934 లో బోధేస్వరన్, కార్తియాని అనే దంపతులకి పుట్టింది. తండ్రి కవి, స్వాతంత్ర సమర యోధుడు. తల్లి ఆమె రోజుల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన కొద్దిమంది మొదటి మహిళల్లో ఒకరు. సంస్కృత అధ్యాపకురాలిగా పనిచేసింది. తన సాహిత్యాభిలాషని తీర్చుకోవడానికి ఇంట్లో చక్కని వాతావరణం, స్వేఛ్చా ఆమెకు ఉంది. ఆమె ఫిలాసఫీ లో మాస్టర్స్ చేసింది. భర్త రచయిత విద్యావేత్త, మేధావి ఎన్నో రచనలు చేసిన ఘనత ఉన్నవాడు. ఇక ఆమె సహోదరి, హృదయ కుమారి సాహిత్య విమర్శకురాలు, విద్యావేత్త, కేరళ సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ గ్రహీత. ఇలా ఆమెకు చుట్టూతా ఒక అద్భుతమైన వాతావరణం, అది చాలు ఆమె పని, ఆశయాలు ఎటువంటి ఆటంకాలూ లేకుండా సాగడానికి. ఆమెకొచ్చిన ఎవార్డ్స్ లిస్ట్ రాస్తే గిన్నీస్ రికార్డ్ కి ఎక్కేంత పెద్దగా ఉంది 2006 లో ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ కాకుండా.

    1968: Kerala Sahitya Akademi Award for Poetry for Pathirappookkal
    1978: Kendra Sahitya Akademi Award for Rathrimazha
    1982: Odakkuzhal Award for Ambalamani
    1984: Vayalar Award for Ambalamani
    1991: Asan Prize
    2001: Lalithambika Sahitya Award
    2003: Vallathol Award
    2004: Kerala Sahithya Akademi Fellowship
    2004: Balamaniamma Award
    2004: Bahrain Keraleeya Samajam Sahitya Award
    2004 Mahakavi Pandalam Keralavarma Poetry Award
    2007: P. Kunhiraman Nair Award for Manalezhuthu
    2008: Award for Lifetime Contribution to Children's Literature
    2009: Ezhuthachan Award
    2009: Basheer Award
    2013: Saraswati Samman for Manalezhuthu
    2013: Kadamanitta Award
    2013: PKV Award for Literature
    2013: Pandit Karuppan Award
    2014: VT Literary Award
    2014: Mathrubhumi Literary Award
    2014: Thoppil Bhasi Award


Other awards

    1986: Indira Priyadarshini Vriksha Mitra Award
    2006: Panampilly Prathibha Puraskaram
    2007: Streesakti Award
    2007: K. Kunhirama Kurup Award
    2009: M.T.Chandrasenan Award


మొదట కవిత్వానికే పరిమితమైనా తరవాత కాలంలో ఆమె పర్యావరోణోద్యమాల్లో చురుకుగా పాల్గొంది. దేశవ్యాప్తంగా జరిగిన పర్యావరణోద్యమాలకి ఆమె నాయకత్వం వహించింది. కేరళలోని సైలెంట్ వేలీ అనే సహజారణ్యాన్ని ఒక జల విద్యుత్ ప్రాజక్ట్ వల్ల ముంపుకి గురవకుండా కాపాడింది. చెట్టు గురించి ఆమె రాసిన ఒక కవిత “Ode To A Tree" ఆమె కేరళలో పాల్గొన్న అన్ని ఉద్యమాలకీ పాటయ్యింది. ఒక స్త్రీ తన అసలు అస్తిత్వం గురించి చేసే నిరంతర అన్వేషణ ఆమె తన జీవితమ్నుంచి, తన రచనల్లోకి ఒంపినట్టుంటాయట ఆమె స్త్రీ పాత్రలు. స్త్రీ పురుష సంబంధాలలోని అతి సున్నితమైన అంశాలని ఆమె స్పృశించేది ఆమె రచనల్లో. ప్రకృతి సమ్రక్షణ సమితి అనే సంస్థ ఆమె స్థాపించి నడిపింది పర్యావరణ సమ్రక్షణ కోసం. అభయా గ్రామం అనే సంస్థని మానసిక రోగులైన స్త్రీల కోసం స్థాపించి ఆశ్రయం ఇచ్చింది. ఇది ఎందుకంటే ఒకసారి ఆమె ఒక ప్రభుత్వ మానసిక అరోగ్య కేంద్రానికి వెళ్ళి అక్కడ చూసిన రోగుల స్తితిగతులు ఆమెని కలిచివేసి, వారికి సాయపడాలన్న ఉద్దేస్యంతో చేసిందట. ఆ మానసిక రోగులని పోలీసు కేంప్స్ లోని మగవారు లైంగికంగా అత్యాచారాలు చెయ్యటం అతి దుర్భరమైన పరిసరాల్లో వాళ్ళు జీవశ్చవాల్లా ఉండటం ఆమె చూడలేక పోయింది. ఈ విధంగా స్వఛ్చంద సంస్థలు కలగజేసుకోవడం కొంతమంది అధికారులు వ్యతిరేకించి బెదిరించినా ఆమె లెక్క చెయ్యలేదు. అప్పట్నుంచి ఆమె రచనల్లో కూడా మార్పు వచ్చింది. సమాజంలోని అవకతవకలకీ, అన్యాయాలకి వ్యతిరేకంగా స్త్రీవాద ప్రతిస్పందనలుగా ఆమె రచనలు సాగాయి. కేరళ స్తేట్ వుమన్స్ కమిషన్ చైర్ పర్సన్ గా ఉంటూ ఆమె ఎన్నో స్త్రీల ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంది.

ఎంతో సున్నితమైన కవిత్వంతో అదే సమయంలో ఒక గొప్ప వేదాంతంతో మలయాలంలో భావకవిత్వానికి ఆమె కొత్త ఊపిరి పోసిందని ప్రసంశలందుకుంది .అమ్మ అనే కవిత 1989 దేవకి కధని స్త్రీ కోణమ్నుంచి సొంత అన్న అయిన కంసుడి నుంచి సహించిన హింసను గురించి చెప్తుంది. గల్ చైల్డ్ ఇన్ 1990స్ అనే పోయెం బాలికల మీద జరిగే అణిచివేత దోపిడీల గురించి రాసింది. అత్తపది అనే చోటి గిరిజనులకు ఆమె అమ్మ. అంతరించిపోయిన అరణ్యాన్ని తిరిగి పెంచి వారికి అండగా నిలబడింది ఆమె. వారి బోగోగులకి, పక్కా ఇళ్ళ నిర్మాణానికి ఎంతో కృషి చేసింది, కాని అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం ఆమెని బాధించేవి.

ఆమె మొదటి కవితే వేరే కలం పేరుతో అచ్చేసింది ఒక సంచలనమే సృష్టించింది. ఆమె రాసిన పదమూడు పధ్నాలుగు సంకలనాల్లో చాలా వాటికి ఎంతో అరుదైన పురస్కారాలొచ్చాయి. దురదృష్ట వశాత్తూ, అనువాదాలు లభించక చదివే భాగ్యం కలగలేదు. కేంద్ర సాహిత్య ఎకాడమీ ఎవార్డ్ వచ్చిన కవితా సంకలంలో టైటిల్ పోయెం నైట్ రైన్ కి తెలుగు అనువాదం. తన పాత్ర దుఖంతోనో, తన పాఠకురాలి దుఖంతోనో మమేకమయ్యితనదిగా చేసుకుని రాసినదే ఈ కవిత.

రాత్రి వర్షం

ఒక మతిలేని యువతిలా
ఏడుస్తూ, నవ్వుతూ, వెక్కిళ్ళు పడుతూ,
అకారణంగా
ఆపకుండా గొణుగుతూ,

నీ జాలి, నీ అణుచుకున్న ఆగ్రహం
నీ రాత్రిళ్ళు రావడం
ఒంటరిగా పట్టలేని దుఖంతో రోదించడం;

తెల్లవారుతూనే,
బలవంతపు నవ్వుని కడుక్కున్న మొహంపై అతికించుకుని
ఏదో ఒక పనిలో నువ్ పడే తొందర;

ఇదంతా నాకెలా తెలుసు?
నా నేస్తమా, నేనూ నీలాగే
నీలాగే, రాత్రి కురిసే వర్షాన్ని.


తను రాసే కవితలే తన నిజ జీవితంలో, సమాజంలో తను వేస్తున్న అడుగులుగా, తను రాసే దానికి చేసే దానికి తేడా లేని ఆమె జీవితం కవులూ, కవయిత్రులందరికీ ఆదర్శం కావాలి. వచ్చే వారం ఇంకొక అద్భుత రచయిత్రి పరిచయంతో కలుద్దాం.

 

-Sharada Sivapurapu