Facebook Twitter
ప్రకృతి కన్య (కవిత)

 

ప్రకృతి కన్య



వెన్నెల్లో ఆ మంచుపూలన్నీ
తోడు కోసం ఎదురుచూస్తున్నపుడు
చిమ్మచీకటి నిశ్శబ్ధంగా గుసగుసలాడుతుంటే
పచ్చని ఆకుల చెక్కిళ్ళపై మంచు ముత్యాలు
ఆహాఁ ఏ రాగమది.. ఏ మురళికీ అందదే?
చిన్నగా పైపైకి వీస్తున్న ఓ పిల్లతెమ్మెరకు
అటూ ఇటూ సిగ్గుతో పరిగెడుతున్న చెట్లు
ప్రకృతి కన్య ఎంత ముచ్చటగా ఆడుకుంటోంది.

 

 

-----సరిత భూపతి