Facebook Twitter
మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి? సంచియ హొన్నమ్మ - కన్నడ రచయిత్రి




మీకు తెలుసా ఈ రచయిత్రుల గురించి?
 

సంచియ హొన్నమ్మ - కన్నడ రచయిత్రి

 

    అగ్ర వర్ణాల వాళ్ళో, విద్య అందుబాటులో ఉన్న వాళ్ళో, లేదా భక్తి పారవశ్యంలోఉన్న వాళ్ళో, కవిత్వాలు రాసారు, ఆశువుగా పాటలూ, పదాలూ పాడారు. కానీ ఇవేమీ లేని ఒక పనిమనిషి కవిత్వం రాసే స్థాయికి ఎదగడం చెప్పుకోదగ్గ విషయం కదూ అపుడైనా, ఇప్పుడైనా. సంచియ హొనమ్మ, మైసూరు రాజు చిక్క దేవరయ (1672-1704) దగ్గర పనిమనిషి. రాణి దేవజమ్మణ్ణి కి ఇష్ట సఖి. రాజ ప్రాసాదంలో ఆమె పని, రాజ కుటుంబీకులకి పాన్ లు అందించడం. అందుకు ఆ సరంజామా అంతా ఒక సంచిలో వేసుకుని ఆమె అందరి దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేదిట, అందుకు ఆమె పేరు కూడా సంచియ (అంటే కన్నడలో సంచి అనే అర్ధము) అని వచ్చిందట. ఆమె ఎంత తెలివైనదంటే, ఆస్థాన కవి సింగరాచార్య, పదాలతో ఆమె కున్న పట్టుని గమనించి ఆమెను శిష్యురాలికింద స్వీకరించి, చదవటం రాయటం నేర్పాడట. ఆమె ఉత్సాహం, నేర్పరితనానికి ముగ్ధుడై ఆమెకి కవిత్వం రాయటం రాయటానికి కావల్సిన మెలకువలు కూడా నేర్పాడట. పైగా ఆమెను ముద్దుగా సరస సాహిత్యాది వరదేవత అని పిలిచేవాడట.

కన్నడనాట 9 వ శతాబ్దం నించి 12 వ శతాబ్దం వరకూ జైనుల రచనలు, తీర్ధంకరుల గురించి, వారి జీవిత గాధల గురించి, రాజుల గురించి రాయబడ్డాయి. పన్నెండవ శతాబ్దం నించి పదహేనవ శతాబ్దం వరకూ వీరశైవం ప్రభావం ఉంది కన్నడ సాహిత్యంపై. బసవ, అల్లమ ప్రభు, అక్కమహాదెవై వీరశైవాన్ని ప్రచారం చేసిన కవులు. పదిహేనవ శతాబ్దం నించి పదిహేడవ శతాబ్దం వరకూ వైష్ణవ భక్తి ప్రభావం కనపడుతుంది. పదహారవ శతాబ్దంలో, వైష్ణవ కవులకి విజయనగర సామ్రాజ్యంలోని రాజులు ముఖ్యంగా క్రిష్ణ దేవరాయలు బాగా ఆదరించి ప్రొత్సహించాడు. రాయల ఆస్థానంలో తెలుగు కన్నడ, సంస్కృత కవులు ముగ్గురూ సమంగా భాసిల్లారు. విజయనగర సామ్రాజ్యం తరవాత కన్నడ సాహిత్యం ఇటు మైసూరు, కేలడి, అంటే ఇప్పటి శివమొగ్గ దిస్ట్రిక్ట్ లో ఉన్న రాజుల ప్రాపకంతో విలసిల్లింది. పదిహేడవ శతాబ్దంలోనే ఇటు అంగ్లేయుల ప్రభావం వారి సాహిత్య ప్రభావం కన్నడ సాహిత్యంపై పడి భక్తి ముఖ్యాంశంగా సాగిన సాహిత్యం సామాజిక, లౌకిక విషయాలపై కూడా మొగ్గు చూపింది.

ఈ క్రమంలో కనిపిస్తుంది హొనమ్మ సాహిత్యం కూడా. హోనమ్మ హదిబధీయ ధర్మ (Hadabadeya Dharma – The Duties of a Devoted Wife) అనె కవితా సంకలనం రాసింది. ఇది ముఖ్యంగా ఒక వివాహిత నెరవేర్చవలిసిన ధర్మాలు, తన భర్త పట్ల, కుటుంబం పట్ల. ఎలా నడుచుకుంటే, భర్త ఇస్టాయిష్టాలనుబట్టీ సంసారం సాఫీగా సాగుతుంది అని వివరించింది. అయితే హొనమ్మ తను ఉన్నప్పటి సమాజాన్ని వ్యతిరేకించలేదు. అప్పటి సామాజిక విలువల్ని గౌరవిస్తూనే, అప్పటి కట్టుబాట్లలో ఉన్న లోపాలు/అతిలు మాత్రం ఎత్తి చూపింది. ఆమె చాలా విశ్వాసపాత్రురాలు, రాజకుటుంబానికి. ఒక సేవకురాలుగా పనిచేస్తూ చదవటం, రాయటం నేర్చుకుని, కవిత్వం రాసి సాహిత్య చరిత్రలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుందంటే, ఇంతకాలం చరిత్రలో నిలిచిందంటేనే ఆమె ప్రతిభ ఏంటో అర్ధమవుతుంది. ఇప్పటికీ ఆడపిల్లలకి ఆమె చెప్పిన జాగ్రత్తలు వివాహం ముందు చెప్పే అలవాటు ప్రజలుకుందంటే కొంచం ఆశ్చర్యం కదూ.

హొన్నమ్మ రాసిన ఈ పోయెం చూద్దాం. ఆనాటి ఆడవాళ్ళ పరిస్తితికి ఇది ఎలా అద్దం పడుతుందో చూడండి. ఎప్పటి సమాజం కూడా ఒక రకమైన నిర్లక్ష్యంతోఆడదై పుట్టాక కష్టాలు అనుభవించక తప్పుతుందా, సీతమ్మవారే తప్పించుకులేకపోయింది అనే కర్మ సిద్ధాంతాన్ని స్త్రీల జీవితాలకి కన్వీనియంట్గా అన్వయించుకుని వదిలేసింది. ఆడపిల్లల తండ్రులుగా బాధ పడే పురుషులు ఇప్పుడున్నట్టే అప్పుడూ ఉన్నారు, అయినా ఏదైనా చెయ్యాలని, పరిస్తితుల్ని మార్చాలని, పురుషులు మారాలని మాత్రం అనుకోలోదు. పురుషులు కూడా (హృదయం ఉన్న కొందరు) సైలెంట్ గానే బాధ పడ్డారు.


Garathiya Haadu - Song of a Married Woman

Wasn't it woman who bore them,
Wasn't it woman who raised them,
Then why do they always blame woman,
These boors, these blind ones,

In the womb they are the same,
When they are growing they are the same
Later the girl will take,tead of spending on yourself with love, what's given
The boy will take has share by force.

For money's sake, for trust,
And friendship's sake
Don't give a girl to a walking corpse,
Bereft of virtue, youth and looks.

Don't say “we are poor people, where
Can we get jewels from?”
Instead of spending on yourself
Provide your daughters with clothes and ornaments.



ఒక వివాహిత పాట

వారిని గర్భాన మోసింది ఆడది కాదా
వారిని పెంచి పెద్ద చేసింది ఆడది కాదా
మరి ఎందుకు ఎల్లప్పుడూ ఆడదే దూషించబడుతుంది
ఈ మూర్ఖులు, అంధుల చేత?

గర్భంలో ఉన్నపుడు వారొకటే,
పెరుగుతున్నపుడూ వారొకటే,
తరవాతే అమ్మాయి తనకు దక్కేది ప్రేమతో తీస్కుంటుంది,
అబ్బాయి మాత్రం బలంతో లాక్కుంటాడు.

ధనం కోసమో, నమ్మకం కోసమో
స్నేహం కోసమో
ఏ బిడ్డనీ గుణం, యవ్వనం, అందం
లేని, నడిచే శవానికివ్వద్దు.

మేము బీదవారము,
ఆభరణాలెలా కొనగలమని అనవద్దు,
మీమీద ధనము ఖర్చు చేయక
మీ బిడ్డలకు నగలు, బట్టలు కొనిపెట్టండి.


xxxxx

కట్నం ఇవ్వాల్సొస్తుందని ఆడపిల్లని ఇవ్వాళ కడుపులోనో, పుట్టాకా గొంతు నొక్కేసోనో చంపేస్తున్నారు. లేకపోతే ఏ దారే పోయే దానయ్యకైనా, నిలబడితే మగాడిలా కనిపిస్తే చాలనుకుని ఇచ్చి పెళ్ళి చేసి ఆతరవాత ఇంక ఆ ఆడపిల్ల మొహం చూడటానికికూడా ఇష్టపడటంలేదు. అదే ఆడపిల్ల కాస్త కాళ్ళుచేతులూ ఆడించగల్గినప్పట్నుంచీ పుట్టింట్లో చాకిరి చేసి, ఆ తరవాత మెట్టింట్లో చాకిరి చేసి చివరికి చీపురు పుల్లంత విలువకూడా లేకుండానే బ్రతుకు గడిపేస్తుంది. ఈ పరిస్తితిలో వీసమంత మార్పు కూడా ఇన్ని వందల ఏళ్ళ బట్టి రాలేదు. విలువుండాలంటే డబ్బు, పదవి, అధికారం ఇవన్నీ ఉండాలి. అప్పుడే పూజింపబడుతుంది ఆడది స్వార్ధం కోసమే అయినా.

ఇప్పటిదాకా మనం తెలుసుకున్న రచయిత్రులు సామాజిక స్పృహను తమ రచనల్లో ప్రతిబింబించారంటే సమాజాన్ని ధిక్కరించి ప్రశ్నించాల్సిన అవసరం, అణచివేత, వివక్ష, బలయిపోయిన నేపధ్యంలో వాళ్ళ జీవితాలు గడిపారు కాబట్టి సమాజంలో ఉన్న అవకతవకలు ఎత్తిచూపాల్సిన అవసరాన్ని కూడా అంతే బలంగా అనుభూతి చెందారు, అదే రాసారు. కాని సంచియ హొన్నమ్మ రాజ ప్రాసాదంలో రాణీ గారి ఇష్టసఖిగా సుఖంగా జీవితం గడుపుతున్నా, రాజ ప్రాసాదం బయట జీవితం ఆమె చూసింది అర్ధం చేసుకుంది, స్పందించింది. అందుకే కన్నడ సాహిత్య చరిత్రలో రాసిన హొన్నమ్మ పేజీ ఒక అనూహ్యమైన సామాజిక స్ప్రుహతో రెప రెప లాడుతూనే ఉంటూంది ఎప్పటికీ .

 

 

....Sivapurapu Sharada