Home » పిల్లల కోసం » మంచితనంFacebook Twitter Google
మంచితనం

మంచితనం

 


అడవిలో ఎలుగుబంటి ఒకటి ఉండేది. ఒకసారి అది తేనె కోసం వెతుకుతూ ఉంటే, చెట్టుపైన ఓ పెద్ద తేనెపట్టు కనిపించింది. ఆ తేనెపట్టులోంచి తేనె కారుతోంది! కొంచెం కొంచెంగా, చెట్టు క్రిందికంటా కారుతోంది. ఎలుగుబంటి ఇంక ఊరుకుంటుందా? వెళ్ళి దానిని నాకటం మొదలు పెట్టింది. అది చూసాయి తేనెటీగలు! ’అమ్మో! ఈ ఎలుగుబంటి తేనెను నాకి ఊరుకోదు. 


మళ్ళీ చెట్టెక్కుతుంది. మన తేనెపట్టును పట్టుకొని, దాన్ని పిండి తినేసేటట్లుంది!’ అనుకొని, దాని మీదికి దూకి కుట్టసాగాయి. అది గమనించిన ఎలుగుబంటి చేతికందిన రాళ్ళను, ఆకుల్ని, చెత్తను, చెట్టుకొమ్మల్ని వాటి మీదకు విసిరేస్తూ గంతులు వేసింది. తేనెటీగలేమో వాటినుండి తప్పించుకొని దూరంగా ఎగురుతూ, మళ్ళీ తిరిగి వచ్చి దాన్ని కుడుతూ పోయాయి. కొద్ది సేపటికి ఎలుగుబంటేమో తేనెటీగల్నుంచి తప్పించుకొని పారిపోయింది. 


కానీ ’బుల్లి’ అనే తేనెటీగకు ఎలుగుబంటి వేసిన రాయి తగిలింది పాపం. దాని రెక్క కాస్తా విరిగి వేలాడసాగింది. అది నేలమీద పడిపోయింది. తేనెటీగలన్నీ దాన్ని చూసాయి కానీ, ఏమీ చెయ్యలేక ఊరుకున్నాయి. అయితే కొద్ది సేపటికి తిరిగి వచ్చింది ఎలుగుబంటి! అది వచ్చీ రాగానే అటూ ఇటూ చూసి, బుల్లిని తీసుకెళ్ళి తన గుహలో ఒకచోట పెట్టింది. దానికి రోజూ ఆహారం పెట్టింది. ఏవో ఆకుల్ని తెచ్చి పిండేది దాని రెక్కమీద. అట్లా కొన్ని రోజులు గడిచే సరికి బుల్లి రెక్క అతుక్కున్నది! అది ఎగరగలిగే స్థితికి రాగానే ఎలుగుబంటి దాన్ని విడిచిపెట్టింది.


బుల్లి తన బంధువుల దగ్గరికి వెళ్ళి ఎలుగుబంటి మంచితనం గురించి చెప్పింది. అప్పుడు 'మనం ఎలుగుబంటిని కుట్టిపెట్టినా గానీ, మనసులో ఉంచుకోకుండా మన బుల్లిని కాపాడింది- ఈ ఎలుగు బంటి ఏదో పాపం మంచిదే!’ అనుకున్నాయి తేనెటీగలు. అవన్నీ ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరాయి. తాము సేకరించిన తేనెను ఎలుగుబంటికి బహుమతిగా ఇచ్చాయి. చూస్తూండగానే ఎలుగుబంటి, తేనెటీగలు మంచి స్నేహితులైపోయాయి!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

 


అనగనగా గడ్డంనాగేపల్లిలో ఒక రైతు ఉండేవాడు...
Nov 12, 2018
విరబూసిన పువ్వులం చిరునవ్వుల బాలలం లోగిలో తిరిగాడు చిన్ని చందమామలం
Nov 10, 2018
కంకణాలపల్లిని ఆనుకొని చాలా కొండలు ఉండేవి. రాము అనే పిల్లవాడు ఒకడు రోజూ...
Oct 29, 2018
దూరంగా ఉన్న కొండ
Oct 26, 2018
చాలా కాలంక్రితం దక్షిణాపథానికి విజయసింహుడు అనే చక్రవర్తి ఏలికగా ఉండేవాడు. ప్రజలకు ఎలాంటి లోటూ రానివ్వకుండా పరిపాలించేవాడు ఆయన...
Oct 24, 2018
ఒక అడవి అంచున చెన్నప్ప అనే బోయవాడు ఒకడు ఉండేవాడు...
Oct 13, 2018
అనగనగా ఒక అడవిలో ఒక కోడి ఉండేది. అడవి అవతల ఉన్న ఊళ్లోకి వెళ్ళి
Oct 10, 2018
అనగా అనగా ఒక అడవిలో జింక ఒకటి ఉండేది...
Oct 6, 2018
విజయనగర సామ్రాజ్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆనాడు రాజు గారి పుట్టిన రోజు....
Oct 1, 2018
నా పేరు రాము నేను మీ అంత వయసులో ఉన్నప్పుడు,
Sep 26, 2018
TeluguOne For Your Business
About TeluguOne