Home » పిల్లల కోసం » అల్లరిFacebook Twitter Google
అల్లరి

అల్లరి

 

 

రామయ్య,సావిత్రి ముద్దుల పుత్రుడు రాము చిన్నప్పటి నుండి చాల గారాబంగా పెంచారు.తనకు ఏది కావలి అంటే అది కొనిపించేవారు.అలా ఒక్క రోజు రాము తన ఇంటి పక్కన ఉన్న రవి పెద్ద రైలు బొమ్మతో ఆడుకుంటూ ఉండగా చూసాడు.వెంటనే రవి దగ్గరికి వెళ్లి నాకు ఇవ్వు అది నాది అని గొడవకు దిగి ఇద్దరు దెబ్బలాడుతున్నారు.

ఇంతలోనే ఇద్దరి తల్లిదండ్రులు వచ్చి నచ్చచెప్పి అక్కడి నుండి వారిని తీసుకెల్తారు కాని రాము తనకు రైలు బొమ్మ కావలి అని మారం చేస్తాడు.తల్లి అది మనది కాదు నీకు వేరే కొని పెడతాను అని చెప్పి మరుసటి రోజు రవి రైలు బొమ్మ కన్నా పెద్దది కొనిపెట్టడంతో ఆనందంగా ఆడుకుంటూ ఉండగా అక్కడికి ఒక మావటి వాడు ఏనుగును తీసుకోని వస్తాడు దాన్ని చూసి రాము చాల సంబరాపడిపోతాడు.అది చూసిన తల్లి మావటి వాడికి డబ్బు ఇచ్చి ఏనుగు పై కుర్చోపెడుతుంది.కాసేపటి తర్వాత రాము ఏనుగు దిగమంటే దిగకుండా మారం చేస్తాడు మావటి వాడు భయపెట్టి ఏనుగు పై నుండి దింపేస్తాడు.

రాము ఏనుగు కావలి అని మారం చేస్తాడు..అది మనది కాదు అని తల్లిదండ్రులు ఎంత చెప్పిన వినడు.రాము ఏడుపు ఆపడానికి ఒక ఏనుగు బొమ్మ తెచ్చిన నాకు నిజం బొమ్మ కావలి అని ఏడుస్తాడు.

మరుసటి రోజు పక్క ఊరిలో సర్కస్ వచ్చింది అక్కడ ఏనుగులు ,సింహాలు అని ఉంటాయి అని తెలుసుకొని తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోతాడు..సర్కస్ చూసి అక్కడే ఏనుగును చూస్తూ ఉండగా ఒక సర్కస్ వ్యక్తి ఇంటికి వెళ్లి అంటాడు.రాము నాకు అమ్మ నాన్న లేరు నేను మీతో పాటు వస్తాను అనగా సర్కస్ వాడు మనసులో ఎదో దుర్భుద్ధి తో రామును ఇక్కడే ఉండు అంటాడు అలా రాము ఒక రోజు అంతా జంతువులతో ఆడుకుంటాడు.మరుసటి రోజు తల్లి గుర్తు రావడంతో సర్కస్ వాడికి మా అమ్మ దగ్గరికి వెళ్తాను అని మారం చేస్తాడు..చిన్నపిల్లాడి ఏడుపుకు కరిగిపోయిన అతను ఈరోజు పడుకో రేపు తీసుకోని వెళ్తాను అంటాడు.

అప్పటికే విషయం తెలుసుకున్న రాము తల్లితండ్రులు అక్కడికి వచ్చి రామును తీసుకోని వెళ్ళేటప్పుడు సర్కస్ వ్యక్తీ సంతోషించి వారితో అందరికంటే ఈ ప్రపంచంలో తల్లిదండ్రులే  మిన్న ఈ సత్యాన్ని మీ కొడుకు కూడా గ్రహించాడు అందరు ఇది తెలుసుకుంటే ఏంతో సంతోషంగా ఉంటారు అని చెప్పారు..తల్లిదండ్రులు మన ప్రత్యక్ష దైవాలు..!!


జాని.తక్కెడశిల

 

అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి ఒక పెంపుడు కోతి ఉండేది. ఆ కోతి చాలా మూర్ఖంగా ఉండేది.
Dec 11, 2017
ఒక అడవిలో ఒక కొంగ ఉండేది. ఆ కొంగకు ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఒక వడ్ల మూట.
Dec 8, 2017
అనగా అనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ కుందేలు, ఓ నక్క ఉండేవి. నక్కకేమో, మరి ఎప్పుడెప్పుడు కుందేలును తిందామా, అని ఉండేది.
Dec 5, 2017
అనగా అనగా ఒక ధృవపు జింక ఉండేదట. దాని పేరు రుడాల్ఫు. దానికి ఓ పొడవాటి ముక్కు ఉండేది, ఎర్రగా మెరుస్తూ.
Dec 4, 2017
హరిపురంలో నివసించే పవన్, గణేష్ ఇద్దరూ మంచి మిత్రులు. హరిపురాన్ని ఆనుకునే దట్టమైన అడవి ఒకటి ఉండేది.
Nov 30, 2017
మాలిపురంలో ప్రవీణ్, మహేష్ అనే ఇద్దరు స్నేహితులు కలిసి మెలిసి ఉండేవాళ్ళు.
Nov 28, 2017
గండకీ నదీ తీరంలో దట్టమైన ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక నక్క- ఎలుగుబంటు చాలా అన్యోన్యంగా ఉండేవి.
Nov 24, 2017
ఒక ఊరిలో కుమార్ అనే పిల్లవాడు ఉండేవాడు. కుమార్ ఆరవ తరగతి చదువుతున్నాడు- అతను ఒక మోస్తరు విద్యార్థి.
Nov 22, 2017
అనగనగా ఒక కోతి. దానికి ఓ తాత. తాత-మనుమళ్లు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ.
Nov 20, 2017
రాయలచెరువు ఊళ్లో‌ సీనుగాడు ఏడో క్లాసు చదువుతున్నాడు. ఈడు ఎట్టుంటాడంటే ఎర్రగా, ఎముకలు బైటక్కనపడి
Nov 16, 2017
TeluguOne For Your Business
About TeluguOne