Facebook Twitter
సిండ్రెల్లా

ఏ దేవతిచ్చిందో
కలల రెక్కలున్న కావ్యపు కుంచెనూ,
దోసెడు రంగుల్నీ
దోచేసే నీ నవ్వుల రకాలుగా
దొరికిందో
తెల్లటి కాగిత'మది'
గీద్దామని ఒక చిత్రాన్ని
పాదాల అంచు నుంచి మొదలెట్టా
గాజు చెప్పులు
తెల్లటి గౌనూ,నల్లటి కురులు
రధమెక్కి ప్రయాణిస్తున్నట్లు
కుంచె గీస్తుందిప్పుడు
అనుభూతుల అశ్వవేగంతో
రధపు అశ్వాలను
వేగపు శ్వాసలిడుతూ
ఓయ్ సిండ్రెల్లా
అది నువ్వే
అది నీ నవ్వే
చూసుకో ఓ సారి
కనులు మూసి
నే వేసిన నీ చిత్తరువు
అశ్వాల గిట్టల చప్పుడుతో
కలిసి వినవస్తున్న
నా గుండె సవ్వడి
నీకిప్పుడు వినిపిస్తుంది
చిన్నప్పుడు చదివిన
కధలో నీవేగా నా సిండ్రెల్లా..
నే గీ(రా)సిన అద్భుతంలో
నీవేగా నిలువెల్లా..
నువ్వేనా నా హరివిల్లా...!!!

 

- రఘు ఆళ్ల