Facebook Twitter
శ్రావణమాసం వేళ...

శ్రావణమాసం వేళ

 

 

శుభోదయం 
గుర్తుకొస్తూ .. గుర్తున్నాయి ... గుర్తుకొచ్చాయి 😊

ఆగస్టు నెల ప్రారంభం 
శ్రావణమాసం కై వనితలు ఎదురుచూసే వేళ 
శ్రావణ లక్ష్ములు కొలువుతీరే వేళ 
శ్రావణ మంగళ , శుక్రవారాల లో పడతులు కళ కళ లాడే వేళ 
శ్రావణ మాసము లగ్గాల సందడి , 
పురోహితులకై వెతుకులాడే వేళ 
శ్రావణ మాసము పర్వదినమున 
ముంగిళ్ళు తోరణాలతో , రంగవల్లులతో కళకళ లాడే వేళ 
అన్న దమ్ముల అనురాగముకై సోదరి రాఖీ పౌర్ణమికి ఎదురుచూసే వేళ 
జన్మదిన శుభాకాంక్షలు , వివాహామహోత్సవముల శుభాకంక్షలతో బంధుమిత్రులకు జేజేలు తెలిపే వేళ 
గృహప్రవేశం తో పాలు పొంగించే శ్రావణమాసము వేళ 
ఆడపిల్లలు పుట్టినింట మెట్టినింట దీవెనలు , పసుపుకుంకుములు అందుకునే శ్రావణ మాసం ఎంతో కళ 
ఆడపడుచుల రాకపోకలు సారెనందుకునే వేళ 
గౌరమ్మకు నోమును నోచీ , వరలక్ష్మీ వ్రతమును ఆచరించి వాయనాలు ,రూపును పెట్టి పూజించే శ్రావణ మాసం  తాంబూలములు ఇచ్చేవేళ ..
అంతర్జాలం లో శ్రీ మహలక్ష్ములు పెట్టే అలంకరణలు , పాటలు , నగలు చూచుటకు రెండు కళ్ళూ చాలని వేళ 
శనగలు , కానుకల ఎంపికలు హడావిడి అంతా ఇంతాకదు ఈ శ్రావాణమాసం వేళ ..
దుస్తులకు , ముస్తాబులకు ఈ మాసమే ఓ అందమైన వేళ 
అరచేత గోరింట , పట్టు పావడలతో ముద్దు ముద్దు గా మురిపించే బుజ్జి బంగారాలు కొంగు బంగారాలు చిన్ని లక్ష్ముల ఆనందమాడే వేళ 
వాడ వాడలు , దేశ విదేశాలు కొనుగోలుకు , కొరియర్లకు మహా మహా రద్దీలు 
దర్జీలు , నగల దుకాణాలు కళకళలు 
నాకెంతో ఇష్టమైన ఈ ఆగస్టు నెల , శ్రావణమాసం పర్వదినాలు 
సందడి తెచ్చే వేళకోసం ఎదురుచూసే వేళ !!

- Divya .Chevuri