Facebook Twitter
గర్జిస్తున్న తెలుగువాడు

 

గర్జిస్తున్న తెలుగువాడు

 

 

తెలుగువాడు తెలుగువాడు తెలుగువాడు
ఏమైపోయాడు అప్పటి తెలుగువాడు.
దమ్మున్నోడు, ధైర్యమున్నోడు
ఎప్పటికి ఈ మౌనం వీడుతాడు.
 

బ్రిటీష్ తుపాకీ గుండ్లకు గుండె చూపించిన టంగుటూరి తెలుగువాడు
ఆ గుండె ధైర్యానికి నిజమైన వారసుడ్నని ఎప్పుడు చాటి చెప్తాడు ఈ తెలుగువాడు.
రాష్ట్రసాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు తెలుగువాడు
ప్రాణభయం వదిలి ప్రత్యేకహోదా కోసం ఎప్పుడు పోరాడతాడు ఈ తెలుగువాడు.
విల్లు పట్టి బ్రిటీష్ వెన్నులో వణుకు పుట్టించిన అల్లూరి తెలుగువాడు
పిడికిలి బిగించి కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు తలబడతాడు ఈ తెలుగువాడు.
 

తెలుగువాడు తెలుగువాడు తెలుగువాడు
ఏమైపోయాడు అప్పటి తెలుగువాడు.
దమ్మున్నోడు ధైర్యమున్నోడు
ఎప్పటికి ఈ మౌనం వీడుతాడు.
 

ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు
అప్పటి తెలుగువాడు నీలో నాలో బ్రతికే ఉన్నాడు.
టంగుటూరిలా గుండె ధైర్యం చూపిస్తాడు
పొట్టి శ్రీరాముల్లా ప్రాణత్యాగానికైనా వెనకాడడు
అల్లూరిలా చివరివరకు పోరాడతాడు
కేంద్రం తలవొంచి ప్రత్యేకహోదా సాధించి తీరుతాడు
ఎందుకంటే వాడు తెలుగువాడు.

 

- గంగసాని