Facebook Twitter
నా నవ్వు 

నా నవ్వు 

 

 

నవ్వు నవ్వు హాయిగా నవ్వు
ముఖమునకు అందం నీ చిరునవ్వు 
నవ్వుతూ నవ్వించు నలుగురకూ పంచు  
పసి పాపల కేరింతలు 
తెస్తాయి నవ్వుకే అందాలు 

నవ్విన ప్రతీ క్షణం నవ్వుల లోకం ప్రకృతి కో కొత్త 
నవ్వునే అందించెను మరో చిరునవ్వు బదులుగా
 నవ్వులై హరివిల్లాయెను 

నవ్విన చాలు మురిసేను జనని 
నవ్వుకే అందమాయెను మా బోసి  నవ్వుల పాపాయి నవ్వులు వెదజల్లుచూ 
నవ్వించే మాచిన్నారి పసిడి కాంతుల మా చిట్టిపాపాయి 

నవ్వకిక అని కసిరిన వయసు 
నవ్వుకో వే వయసా అని 
నవ్వు తెప్పెంచే ప్రతీ చిరు దరహాసం  
నవ్వులకే అయ్యేను దాసోహం 

నవ్వులు కాస్త నువ్వులు కాకముందే నవ్విన నవ్వులు భద్రం భద్రం 
నవ్వుతూ గడిపిన కాలాన్ని నేనూనవ్వుతూ 
నువ్వూ నవ్వుతూ 
మనందరం హాయిగా నవ్వుకోవాలి ప్రతీ క్షణం 😊

- దివ్య చేవూరి