Facebook Twitter
ఫీజుల మాయజాలం


ఫీజుల మాయజాలం

 

కరోనా కాలమింక అయిపోలేదు
మళ్ళీ విజృంభించడం మొదలు
కార్పోరేట్ చదువులు కరోనాను లెక్కచేయక
రాజకీయ రాబందులు ఫీజుల వసూలుకై 
పసిపిల్లల ప్రాణాలు సైతం గాలికొదిలేసి
కార్పొరేట్ రాగమందుకుంది
కరోనాకంటే కాటేసే  కాలనాగులు 
నాయకులు నయవంచకులు
అంత మరోసారి లాక్డౌన్ వైపు
అడుగులేస్తుంటే
భవిష్యత్తు వారసుల జీవితాలతో చెలగాటం
చేతివాటంతో జీవితాలన్నీ
గాలిలో దీపాలైతున్నవి
అడుగులన్నీ తిరోగమనం
అంతా పైసా వసూల్
ప్రైవేటు పాఠశాలలు
పడగలిప్పాయ్ 
వ్యాపారం జోరు బతుకు బేజారు
పరిస్థితి ఏదైనా జలగల్లా ఫీజుకు రుచిమరిగి పీల్చేస్తరు
పైసా ఏమోగానీ పానం ముఖ్యంగదా

 

సి. శేఖర్(సియస్సార్)