Home » ఈపేజీ మీకోసం » సర్వాయి పాపన్న కథ వింటారా!Facebook Twitter Google
సర్వాయి పాపన్న కథ వింటారా!

సర్వాయి పాపన్న కథ వింటారా!

 


దేశంలో మొగలాయి పాలనకు వ్యతిరేకంగా నిల్చిన ధీరుడు ఎవరంటే... శివాజీ పేరే చెబుతారు. కానీ శివాజీ అంతటి వీరుడు తెలంగాణలో కూడా ఉన్నాడన్న విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అతనే సర్వాయి పాపన్న. ఎప్పుడో 1650లో వరంగల్‌ జిల్లాలోని జనగాం మండంలోని ఖిలాషాపూర్‌లో జన్మించినవాడు ఈ పాపన్న. గౌడ కులస్తుడు కావడం చేత, కల్లుగీతే వృత్తిగా అతని జీవితం సాగేది.


అదే సమయంలో నిజాం నవాబుల అకృత్యాలు హద్దు మీరిపోయాయి. కల్లు మీద కూడా మోయలేనంత పన్నుని విధించారు. అయినా కిమ్మనకుండా భరిస్తూ, జీవితాన్ని సాగించాడు. కానీ అనుకోకుండా ఓసారి నిజాం నవాబుల అకృత్యాలను ఎదుర్కోవాలసి వచ్చింది. ఆ సమయంలో తన కల్లు గీసే గీతకత్తే ఆయుధంగా, నిజాం సైనికుల కుత్తులను కత్తిరించాడు పాపన్న. ఇక అప్పటి నుంచి అతని జీవితమే మారిపోయింది.


నిజాం నవాబుకు వ్యతిరేకంగా సైనికులను కూడగట్టాడు పాపన్న. గెరిల్లా యుద్ధతంత్రాలతో నవాబుని ముప్పుతిప్పులు పెట్టాడు. ఖిలాషాపూర్ కేంద్రంగా దాదాపు 30 ఏళ్లపాటు ఓ రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆయన పాలనలో రైతులు సుభిక్షంగా, ఎలాంటి పన్నులూ లేకుండా జీవనం కొనసాగించేవారట. ఒకానొక సందర్భంలో గోల్కొండ కోటని సైతం వశపర్చుకున్నాడు పాపన్న. చివరికి మొగలాయి సైనికులకు వ్యతిరేకంగా పోరాడుతూనే వీరమరణం పొందాడు. సర్వాయి పాపన్న శివాజీకి సమాకాలీనుడు.


చిన్నకులంవాడనో, చరిత్రకారులు మర్చిపోబట్టో కానీ ఆయన చరితను తెలుగు సమాజం మర్చిపోయినట్లే కనిపిస్తుంది. అయినా జానపదులు గుండెల్లో ఇప్పటికీ సర్వాయి పాపన్న వెలుగుతూనే ఉన్నాడు. నిజానికి మరుగున పడిపోయిన సర్వాయి పాపన్న చరిత్రను జానపదుల పాటల ద్వారానే చరిత్రకారులు తిరిగి వెలుగులోకి తీసుకువచ్చారు. అలాంటి పాటల్లో ఒకటి ఇదిగో...

ధీరుడు వస్తాదు పాపన్నా పాపన్నా॥
రాయిడు సర్వాయి పాపన్నా
పాపడొక్క పేరు చెబితే
ఊరపిచ్చుక ఊరుచేరదు
పొట్టిపిచ్చుక పొలం చేరదురా                                          ॥పాప॥

పుట్టినాది పులగాము
పెరిగినాది తాడికొండ
కులమందు గమళ్ళవాడు
పేరు సరదారి పాపన్నా                                                  ॥పాప॥

తల్లికి దండాముపెట్టి అమ్మరో సర్వమ్మతల్లి
నన్ను గన్నతల్లి రావే నాకు తగ్గ పనులుచెప్పవే                   ॥పాప॥

వినరా సర్దారిపాప కలవిద్యలు యెన్నిచేర్చిన
కులవిద్యకు సాటిరావు ఇంకా కొన్నాళ్ళు కొడుక
ఇంటి యావులు మేపమంటాది సర్వమ్మ తల్లి
ఈతచెట్టే గీయమంటాది                                                 ॥పాప॥

ఈదులు గొడితే యీడిగవాడు
కల్లు గొడితే గమళ్ళవాడు
మొనగాడి చట్టమొచ్చునా సర్వమ్మ తల్లీ
పాళెగాడి చట్టమొచ్చునా                                               ॥పాప॥

ఊరు గొడితే యేమి ఫలము
పల్లెగొడితే యేమి ఫలము
పడితే బందరే పడతానే సర్వమ్మ తల్లి
కొడితే గోల్కొండ కొడతానే                                              ॥పాప॥

తిన్నగా తిరుచూర్ణ మద్ది
పాలు అన్నం భోంచేసి
పసిడిబెత్తం చేతబట్టాడోయ్‌ పాపన్నా
అవత లివతల వెండికట్లు
నడుమ బంగారు కట్లు
డాలుబల్లెము చేతబట్టాడోయి పాపన్నా
మండీబజారు కొచ్చి సోపుదారి కేకలేశాడోయ్‌                     ॥పాప॥

 

-నిర్జర

దివిటీల పండుగ టపాసుల పండుగ లక్ష్మిపూజ పండుగ దీపావళి పండుగ
Oct 14, 2017
అతడు-ఆమె-ఆకాశం
Oct 10, 2017
తెలుగునాట లాలిపాటలకు కొదవేమీ
Sep 29, 2017
తెలుగునాట అమ్మవారి దసరా ఎంత వేడుకగా
Sep 27, 2017
ద‌స‌రా వ‌చ్చేసింది. ఎటుచూసినా అమ్మ‌వారి కొలుపులే క‌నిపిస్తున్నాయి.
Sep 25, 2017
ఇప్పుడంటే గురువులకి తగినంత జీతం దక్కుతోంది.
Sep 22, 2017
అల్లదే ఇంద్రకీలాద్రి, ఆకసమ్ము పై కెగయబ్రాకు, నల్ల యా ప్రాతగుడిసె
Sep 21, 2017
బతుకమ్మ మీద ఇప్పుడు చాలా పాటలే వినిపిస్తున్నాయి.
Sep 19, 2017
ఇవాళ కంప్యూటర్లో గూగుల్‌ హోంపేజి చూసిన ప్రతి ఒక్కరికీ ‘శామ్యూల్‌ జాన్సన్‌’ పేరుతో ఓ డూడుల్‌ కనిపించడం ఖాయం.
Sep 18, 2017
కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగా
Sep 6, 2017
TeluguOne For Your Business
About TeluguOne