Facebook Twitter
వానల్లు కురవాలి వానదేముడా

వానల్లు కురవాలి వానదేముడా

 

 

వానల్లు కురవాలి వానదేముడా
వరిచేలు పండాలి వానదేముడా
నల్లాని మేఘాలు వానదేముడా
చల్లంగ కురవాలి వానదేముడా
చేలన్ని నిండాలి వానదేముడా
మూనాలు యెదగాలి వానదేముడా
యెన్నులు వెయ్యాలి వానదేముడా
పన్నుగ సేలన్ని వానదేముడా
పంటల్లు పండాలి వానదేముడా
భాగ్యాలు నింపాలి వానదేముడా
పండుగలు సేత్తాము వానదేముడా
మావూరి చెరువైన వానదేముడా
ముంచెత్తి పోవాలి వానదేముడా
కప్పలకు పెళ్ళి వానదేముడా
గొప్పగ సెయ్యాలి వానదేముడా

(వర్షాలు బాగా పండాలంటూ అనాదిగా జానపదులు పాడుకుంటున్న పాట ఇది. కృష్ణశ్రీ సంకలనం చేసిన ‘పల్లెపదాలు’ అనే పుస్తకంలోంచి)