Home » పిల్లల కోసం » సింహం-అడవిFacebook Twitter Google
సింహం-అడవి

సింహం-అడవి

 

ఊరికి దగ్గరగా దట్టమైన అడవి ఒకటి ఉండేది. గుబురైన చెట్లతో, గల గలా పారే నీళ్ళతో, అనేక జంతువులతో ఆ అడవి కళకళలాడేది. దీనికి కారణం, ఆ అడవిలో ఉండే సింహం. చెట్లను కొట్టేసేందుకూ, జంతువుల్ని వేటాడేందుకూ వచ్చే వాళ్ళని అది అస్సలు సహించేది కాదు. 

 

మనుషులందరికీ అదంటే భయం. అది ఉన్న అడవిలోకి వాళ్ళెవ్వరూ‌ అడుగు పెట్టే వాళ్ళు కాదు. ఒకసారి ఎందుకనో సింహం ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది.దాంతో అది గుహకే పరిమితమైపోయింది.

 

ఇదివరకటి లాగా అడవి అంతటా తిరగట్లేదు. ఆ సంగతి తెలుసుకున్న ఊళ్ళో మనుషులు మళ్ళీ అడవిలో తిరగసాగారు. చెట్లు కొట్టేయటం, కుందేళ్ళనూ జింకలనూ వేటాడటం మొదలు పెట్టారు. రోజు రోజుకూ అడవి పలచబారింది.

 

'దీనికంతటికీ కారణం సింహరాజు ఆరోగ్యం బాగా లేకపోవటమే' అని గుర్తించిన జంతువులన్నీ సింహం గుహకు వెళ్ళి చూసాయి. సింహం జ్వరంతో మూలుగుతూ పడుకొని ఉన్నది. డాక్టరు దగ్గరికి వెళ్లనే లేదు!

 

దాంతో జంతువులన్నీ కలిసి ఏనుగు డాక్టరుకు ధైర్యం చెప్పి, దాన్ని తీసుకెళ్ళి సింహనికి వైద్యం చేయించినై. సింహానికి ఆరోగ్యం బాగైంది. అడవి అంతటా దాని గర్జనలు వినిపించినై మళ్ళీ. దాంతో మనుషులంతా అడవికి రావటం మానేసారు. త్వరలోనే అడవి అంతా చెట్లు-జంతువులతో కళకళ లాడింది.

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

 

 

రాయలచెరువు ఊళ్లో‌ సీనుగాడు ఏడో క్లాసు చదువుతున్నాడు. ఈడు ఎట్టుంటాడంటే ఎర్రగా, ఎముకలు బైటక్కనపడి
Nov 16, 2017
బడిలో బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. వేదిక మీద వెనకగా ఉన్న ఫొటోలో చాచా నెహ్రూ నవ్వుతున్నాడు.
Nov 14, 2017
లోచర్లలో ఉండే చందు ఇప్పుడిప్పుడే ఆరో తరగతికి వచ్చాడు. వాళ్ల ఊరులో హైస్కూలు లేదు.
Nov 13, 2017
లలిత, వనిత ఇద్దరూ అక్కచెల్లెళ్లు. వాళ్ళది పేద కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరూ కూలికి పోయేవాళ్ళు. అయితే అకస్మాత్తుగా ఒక రోజున ప్రమాదంలో వాళ్ల అమ్మా నాన్నలు చనిపోయారు!
Nov 3, 2017
తరగతిలోని పిల్లలందరికంటే కొంచెం పెద్దవాడు విజయ్; చాలా అల్లరి పిల్లాడు కూడా. ఆలోచన అనేదే లేకుండా ఎప్పుడూ ఏదో ఒక చిలిపి పని చేసి, ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉండేవాడు. టీచర్లు, పెద్దలు చేయద్దన్నదల్లా చేస్తూ ఉండేవాడు ఊరికే.
Nov 1, 2017
అనగనగా ఒక ఊరిలో ఒక అడవి ఉండేది. ఆ అడవికి వెళ్ళాడొక వేటగాడు. వాడు ఆ అడవి మధ్యలో వల వేశాడు. ఆ వలలోకి ఏ జంతువులో, పక్షులో వచ్చి పడతాయని ఎదురు చూస్తూ చెట్టు క్రింద కూర్చున్నాడు.
Oct 30, 2017
బడిలో పిల్లలంతా కలిసి మ్యూజియం చూద్దామని వెళ్లారు.
Oct 26, 2017
ఒక అడవిలో ఒక కుందేలుండేది. ఆ కుందేలు ఎప్పుడూ సంతోషంగా ఎగురుతూ,నవ్వుతూ ఉండేది.
Oct 5, 2017
ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వ దగ్గర ఒక మేక ఉండేది.
Oct 4, 2017
రాముకు భయం ఎక్కువ. ఊళ్లో అంతా పిరికి రాము అని పిలుస్తారు
Oct 3, 2017
TeluguOne For Your Business
About TeluguOne