Facebook Twitter
విహారిస్తావ్

 

విహారిస్తావ్

 

 

ఒకసారలా
విహారానికెళ్లోద్దాం...రా..!
ఆ తావుల్లో ఎదురేగేది
ఆ కోనల్లో ఎగిరేది
చూస్తుండు నాతో
చెమటలారిన బీడు దేహాలు
చిగురొచ్చి రాలిన కాసిన్ని ఆకులు
దేనికి పుష్పించాయో తెలియని
తెల్ల మొహాలేసిన
నలిగిన నల్లటి పువ్వులు కొన్ని
చరిత్రలో బద్దలైన రాళ్లు మరిన్ని
చెంపలూడిన చెదబెరళ్లు ఇంకొన్ని
వాటి గమనాన్ని వాటినెతుక్కుంటున్న
చలి చీమలు
కలి పాములు
సాయానికి సోలిన చేతులు
గాయానికి లేచిన రాతలు
పగటినే చూడని రాత్రులు
.
.
.
విహారంలో అగుపిస్తాయక్కడ
సమాహారమైనట్లు
సమావేశమైనట్లు
నీ కోసమే
ఉన్నట్లుంటాయ్!
నా చేతిని పట్టుకున్న
గడియారపు బాటలో...!
ఇప్పుడు చూడు
నీకు నువ్వుగానే
నీ నవ్వులో విహరిస్తుంటావ్...
నీ గడియారాపు ముళ్ల మధ్య,
వెనక్కి తిరుగుతూ..
ముందుకు సాగుతూ...
విహరిస్తున్నావ్ చూడిప్పుడు!!!!


 - రఘు ఆళ్ల