Facebook Twitter
మన దేశంలోని జాతీయ భాషల వివరాలు

 

ఫిబ్రవరి 21 వ తేదీ ప్రపంచ మాత్రుభాషాదినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. బహుభాషాతనాన్ని, భాషా సాంస్క్రుతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు అవగాహన పొందేందుకు ఈరోజును ప్రపంచ మాత్రుభాషా దినోత్సవంగా జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి సాంస్క్రుతిక విషయాల సంస్ధ యునెస్కో ఈరోజును ప్రపంచ మాత్రుభాషా దినోత్సవంగా జరుపుకోవాలని 1999 నవంబర్ 17 వ తేదీ న ప్రకటించింది. ఐరాస జనరల్ అసెంబ్లీ ఈ విషయాన్ని ద్రువీకరించి 2008ని అంతర్జాతీయ భాషా సంవత్సరంగా ప్రకటించింది. అంతర్జాతీయ మాత్రుభాషా దినోత్సవం రోజు...ప్రపంచంలోని అన్ని దేశాలలో భాషల వివరాలు తెలుసుకొనేంత సమయం అందరూ కేటాయించగలరో లేరో కనీసం మన భారతదేశంలోని 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలలోని భాషల వివరాలు తెలుసుకున్నా బావుంటుందన్న ఉద్దేశంతో
ప్రపంచ మాత్రుభాషా దినోత్సవం సందర్భంగా మన దేశంలోని జాతీయ భాషల వివరాలు తెలియజేయాలనుకుంటున్నాం...

అవి ఏమిటంటే...
అస్సామీ....బెంగాలీ...గుజరాతీ.... హిందీ....కన్నడ...
కాశ్మీరీ....కొంకణి.....మళయాళం...మరాఠీ.....మణిపురి....
నేపాలీ...ఒరియా...పంజాబీ.... సంస్క్రుతం...సింధీ......
తమిళం...తెలుగు...ఉర్దూ..... బోడో...సంధాలీ....డోంగ్రీ..మైధిలి..ఇవండీ మన దేశంలోని
భాషలు....అందరం అన్ని భాషలు మాట్లాడలేకపోయినా.. కనీసం ఏ ప్రాంతప్రజలు ఏ భాష మాట్లాడతారన్నది తెలుసుకుంటే తర్వాత వారు మాట్లాడిన వాటికి అర్ధాలు
తెలుసుకోవచ్చు...ఇంకెందుకు ఆలస్యం ప్రపంచభాషాదినోత్సవం సందర్భంగా ప్రజలంతా కొత్తభాషనేర్చుకోవటం మీద ఆసక్తి చూపించండి... ఆల్ ద బెస్ట్....