Facebook Twitter
అప్పు...

అప్పు..

 

అవసరాల కోసం చేసే అప్పు
మనిషిని పీక్కుతినే రాబందు
గబ్బిళాల్లాంటి ఇరుగు పొరుగు వాళ్ళు
గది నిండా అనవసరపు ఖర్చులు
ఘడియ ఘడియకు డబ్బుల తిప్పలు
మనిషి ఆశలకు అంతులేకుండా పోతుంటే
ఆ ఆశలు చేసే అప్పులు వడ్డీలా
రోజు రోజుకి పెరిగిపోతుంటే
ఆ అప్పు పెట్టే బాధలు భరించలేక
మనిషికి , పురుగులను చంపే పురుగుల మందే
ప్రాణభిక్ష పెడుతుంది కదా...
అప్పు ఎంతలా ఎదుగుతుంది అంటే
మనిషిని అందనంత ఎత్తు నుండి
కనపడనంత లోతులో పడేస్తుంది.

 

-Malleshailu