Facebook Twitter
ప్రియమైన నేస్తం

ప్రియమైన నేస్తం

 

 

 

నేనున్నా నీకు అంటూ దగ్గరయ్యే మొదటి నేస్తం "అమ్మ "
తోడూ నీడలా మన రక్షణ ఇచ్చే నిరంతర నేస్తం
"నాన్న "
మనందరం ఒకే తీరుగ కలిసిమెలిసున్న నేస్తం
"మన కుటుంబం "
ఎంత ఎత్తు ఎదిగినా విలువలను పంచి , జ్ఞానం పెంచే నేస్తం " మన గురువులు "
ఎల్లలు లేవని హాయిగా ఎక్కడెక్కడో పరిచయ మైన హస్తాలు "మన నేస్తం "
మదిలో గూడును కట్టుకొని పదిలంగా మలిచే ప్రతీ హృదయం "నమ్మకమైన నేస్తం "
అచ్చు గుద్దిన ,చెక్కు చెదరని చెలిమి రహస్యాల నావ "నిజాయితీ ఉన్న నేస్తం "
ఇలలో ,భువిలో ఆనంద కేరింతలు , కవ్వింతలు
పంచిన నేస్తం "బాల్యమే నేస్తం "
ఎన్నడూ వీడవని వెంటే ఉంటావని అందరిలో ప్రవహించే నేస్తం "సరిగమల సరాగాలు నేస్తం "
దాగుడుమూతల దోబూచులాటలో దెబ్బలాటలో
మైమరచి మురిపించే ప్రతీక్షణం "ప్రియమైన నేస్తం "
దూర తీరాన ఎక్కడున్నా ఒకే నేస్తం గుర్తుకొచ్చే వేళ
"కంటతడే నేస్తం "
ఎన్ని హల్లో , హాయి లు ఉన్నా తిరిగిన కాలం లో పలికించిన గళం "నీ మాటే నేస్తం "
అందుకే కల్ల కపటం ఎరుగని మన చెలిమే అవ్వాలి అన్ని వేళల "ఆదర్శవంతమైన స్నేహం ఓ నేస్తం "

- దివ్య చేవూరి