Facebook Twitter
అన్నదాత కన్నీటి గాథ!


అన్నదాత కన్నీటి గాథ!

 

 

 

దేశ రాజధాని వీధులు.. 
రైతుల కన్నీటితో నిండుతున్నాయి.
ఆవేదనలు ఎల్లలు దాటాయి..
కానీ.. ఢీల్లీ పార్లమెంట్ గెట్ దాటలేకపోయాయాయి..
బహుశా రైతుల కన్నీళ్లు..
సంద్రపు నీళ్లు అనుకున్నారేమో.. దేశపు నేతలు
వారి ఆవేదనలు అసభ్యం అనుకున్నారేమో..
సత్యవంతులమనే నాయకులకు..
రైతులవి వాదాలు అనుకున్నారేమో...
అయినా ఆశతో మొండిగా పార్లమెంట్  వైపు చూస్తున్నాయి..
అవి వాదాలు కాదు, నినాదాలు,  
రైతుల విధానాలు కాదు..  
భారత దేశ భవితకు పునాది దారాలు..
ఆర్తనాదాలు ఆవేదన గానాలు..
దేశ గతికి కృతి కి ఆరని ఆవేశపు పాఠాలు..

హక్కుల కోసం పొట్టపట్టుకుని పోరుచేస్తూ..
ప్రభుత్వాల తప్పులను ధిక్కరిస్తూ ఎత్తిన బాణాలు..
ప్రబోధపు గేయాలు..ప్రశ్నించే గళాలు..  
హక్కులకై కదిలిన రైతుల కుత్తికెలు నొక్కుతూ..
ఒక వైపు సర్కార్ మొసలి కన్నీళ్లు కారుస్తూ..
చౌరీ చౌరాలో రక్తం చిందించిందే రైతులే అంటూ..  
రైతుల త్యాగాలను ఆకాశాన్నికి పొగుడుతూ..  
ఢిల్లీ లో మాత్రం పాతాళానికి తొక్కుతుంది..

తన ఉక్కు నరాలతో..
హలాలు దున్ని..  
పొలాలు పండించి..  
దేశపు పొట్టనింపిన అన్నదాతలను..  
ప్రభుత్వం, ప్రయివేట్ విధానాలతో..  
ఎండిన అన్నదాతల గొంతు కొస్తుంది..  
బహుశా రైతు ఏడుపు.. ఎర్రకోటకు వినిపించలేదేమో..  
దేశభక్తి అనే నేతలు భక్తిలోమునిగారు.. మరి.. ?  
బహుశా రైతులదీ దేశ భుక్తి అనుకున్నారేమో..

ఓటమి ఎప్పుడు ఓటమి కాదు.. ?
ఒంటరి అంతకన్నా కాదు ..
ఒక్కొకటి గా చేరి కూటమై కూల్చండీ..
ఢిల్లీ గోడలను. అందుకు శాంతి , పోరాటం మార్గం కాదు..
అందుకు ఓటు ఒక్కటే నీ ఆయుధం.. ఓటు మాత్రమే నీ ఆయుధం..

                                                                                                - రచన : రవిశంకర్