Home » కథలు » అనంత సంగ్రామంFacebook Twitter Google
అనంత సంగ్రామం

 

అనంత సంగ్రామం

 

అనాదిగా సాగుతోంది
అనంత సంగ్రామం
అనాధుడికి, ఆగర్భ
శ్రీనాథుడికీ మధ్య.

సేద్యం చేసే రైతుకు
భూమి లేదు, పుట్రలేదు
రైతులరక్తం త్రాగే
జమీందార్ల కెస్టేట్లు.

మిల్లు నడిపి, కోట్ల డబ్బు
కొల్లగ లాభం తెచ్చే
కూలోనిది కాదు మిల్లు,
మిల్మ్యాగ్నే టొకసేటు.

శత్రువులను యుద్ధంలో
చిత్రంగా వధ చేసిన
పేద సైనికునికి 'సున్న'
రాజ్యమంత రాజులదే.

మధనపడే మేధావులు
శాస్త్రజ్ఞులు, విద్వాంసులు
కనిపెట్టిన అణుశక్తికి
ప్రభుత్వాల కంట్రోళ్ళు.

కర్షకులు, కార్మికులు
మధనపడే మేధావులు
తమ శ్రమలకు తగినఫలం
ఇమ్మంటే "తిరుగుబాటు!"

షావుకారు వడ్డీలకు
జమీందార్ల హింసలకు
వేగలేక ఆగలేక
తిరగబడితే "అతివాదం?"
(దాశరథి కృష్ణమాచార్య రాసిన అగ్నిధార కవితాసంపుటిలోంచి)

ఆనంద్ కర్మకాండలు జరిగిపోయాయి
Jun 29, 2017
అమెరికా ఉదయం 5.00
Jun 22, 2017
ఎంటమ్మా...ఆవిడ పెట్టె బేడాతో
Jun 16, 2017
జాషువా హాస్యం!
Jun 14, 2017
తన కూతురు జాహ్నవి మేడమీద
Jun 8, 2017
చెలి మూతి విరుపు
Jun 2, 2017
వివాహమంటే విడదీయరాని బంధమే
Jun 1, 2017
మా అన్నయ్య అని కాదు కానీ
May 25, 2017
రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లాల్సిన పని పడింది. ఎల్లుండి రాత్రిక్కానీ రాను
May 1, 2017
పసి కూన ఇల్లెగిరి పోయేలా అరుస్తున్నా పడక్కుర్చీలో
Apr 25, 2017
TeluguOne For Your Business
About TeluguOne