Home » కవితలు » కరోనాపై కవితFacebook Twitter Google
కరోనాపై కవిత

కరోనాపై కవిత

 

 

 

చైనాయందుబుట్టి సకల దేశములకుబాకె
అంతుచిక్కనట్టి వింతజబ్బు 
'కరోనా' అనుపేర కరతాళ నృత్యముజేసి 
ప్రజల ప్రాణముల్దీయుచుండె పాపిష్టివ్యాధి
కనివినియెరుగని కాలనాగులవలె
విలయతాండవముజేయుచుండె విస్తృతముగ
లక్షలప్రాణాలు తన కుక్షినింపుకొనుచుండె
కక్షసాధింపుచర్య ఇది నిశ్చయముగ
ప్రపంచాన్నంత గడగడలాడించుచు 
మహమ్మారి రక్కసి కోరలు చాపుచుండె
విలవిల్లాడుచు విధిలేక ఇంటికే పరిమితమైనజనులు
రోజురోజుకు పెరుగుచున్నదేగాని
తగ్గదాయె ఇదియేమిచోద్యమో తెలియదాయె
అవనియంత వ్యాపించి అతలాకుతలముజేసి 
భయభ్రాంతులొందించుచుండె పెనుభూతమయ్యి
శాస్త్రఘ్నులకు గూడ నాడి చిక్కనట్టి నావయయ్యె 
తల్లులు, పిల్లలతాలూకులేక తల్లడిల్లుచుండ్రి 
రాత్రిపగలనుతేడాలేక నీనామస్మరణమే చేయుచుంటిమమ్మ 
కాసింతైన దయలేదటమ్మ మానవులపై నీకు ఓ మహమ్మారి!

పేదలు రైతులు రోజుకూలీలంత ఎట్లుబ్రతకవలెనంచుచింతజెంద
దినమొక ఏడుగ గడుపుచుండిరి బాలలు, వృద్ధులు బయటికెళ్ళలేక
మేధావులందరు దీనికి మందేదో తెలియక
మథనపడుచుండిరి మనసులోన
రాజకీయనాయకులొకరిపైనింకొకరు
విమర్శలు గుప్పించుచుండిరుబుసుపోక
దేశాధినేతలు దిక్కుదోచని స్థితిలో
లాక్డౌను విధించిరి స్వీయ రక్షణ కొరకు
కోవిడ్-19 ను ప్రళయకాల రుద్రునివలె
ప్రబలనాట్యముజేయుచుండె ప్రపంచమంతా
యెంతమంది బలియౌదురో ముందేమియగునో
దైవమాయయో లేక దైత్యులమాయయో తెలియదాయె
కలిమహాత్యమింతఘోరమైనదా!
కలియుగపరిమాణము నాలుగు లక్షలా
ముప్పది రెండువేల సంవత్సరాలనిజెప్పియుంటిరె 
ఇంతలోనేయింత మార్పు వచ్చినదా? ఏదియేమైనా 
రెండువేలా ఇరవయ్యో సంవత్సరంబొక గండుబెబ్బులి 
మానవాళికిదియొక మారణహోమం
ప్రపంచానికిది యొక ప్రబలారిష్టం!

పంచభూతాలను ప్రేమిద్దాం
ప్రపంచమనుగడకు మనవంతు సహకారమిద్దాం, ప్రకృతినిలోని సమస్త జీవరాశులతో మమేకమౌదాం
ప్రబలనూతనోత్తేజంతో ఇలాంటి మహమ్మారులను జయిద్దాం!
విజయీభవ! శుభం భూయాత్!

-పి.వి.ఆర్


సంక్రాంతి స్పెషల్ కవిత
Jan 13, 2020
నా దేశం
Aug 14, 2019
మేలు
Aug 5, 2019
చాలా రోజుల తర్వాత వర్షంలో తడిశా
Aug 2, 2019
కొమ్మన కోయిలలు వరసన పాడితే
Apr 17, 2020
ఆశ (కవిత)
Jun 14, 2019
సంస్కృతి, సంప్ర‌దాయం సంద‌డిచేసేలా.. పసుపు, కుంకుమ ప‌ల్ల‌వి పాడిన శుభ‌వేళ‌..
Apr 5, 2019
ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను.
Apr 30, 2019
అమ్మ నుంచే మన అమ్మ భాష ఆటలతో ఆనందభాష్పాలు
Feb 20, 2019
నేను నిన్ను ప్రేమిస్తున్నా...............తెలుగులో... ముజే తుమ్ సే ప్యార్ హై.............హిందీలో.........
Feb 13, 2019
TeluguOne For Your Business
About TeluguOne