Home » కథలు » సర్కస్ బొమ్మలుFacebook Twitter Google
సర్కస్ బొమ్మలు

సర్కస్ బొమ్మలు

 

బాంబే, ఒక హైటెక్ సిటీ. అందులో పేరుమోసిన సర్కస్ ఒకటి ఉంది. అందులో ఎన్నో జంతువులు- రకరకాల ట్రిక్స్ చేసేవి- ఉండేవి. ఉయ్యాలలూగే కోతులు, నవ్వించే ఒరాంగుటాన్, వివ్యాసాలు చేసే పులి- ఇవన్నీ చూసేందుకు పిల్లలు ఎగబడే వాళ్ళు. ఆ సర్కస్ తమ ఊరు వచ్చిందంటే జనాలకు పండుగలాగా ఉండేది. కానీ ఎవరికీ తెలియని విషయం ఒకటి ఉంది: ఆ సర్కస్ లో జంతువులను హింసిస్తారు.

 

"హింసించకపోతే కౄరమృగాలు మాట వినవు! వాటి చేత మాట వినిపించాలంటే వాటికి అన్నం పెట్టకుండా మాడ్చాలి! కొరడాలతో కొట్టాలి!" అని వాళ్ల నమ్మకం. ఆ నమ్మకంలో కొంత నిజం ఉంది కూడాను. సర్కసులో ఉన్న అనేక జంతువుల్లో ఒక ఏనుగు కూడా ఉండేది. దాని పేరు మోనా. ఒకసారి సర్కస్ నడిపే మాస్టర్ చెప్పిన మాట వినలేదని దాన్ని ఒక మూలన కట్టి పడేసాడు, మేత-నీళ్ళు ఏమీ ఇవ్వకుండా మాడ్చాడు. దాంతో అప్పటికే కడుపుతో ఉన్న మోనా పాపం, ఒక బిడ్డను కని, చనిపోయింది!

 

ఆ బిడ్డకు 'రాక్' అని పేరు పెట్టారు. చిన్నపిల్ల అని జాలి, దయా కూడా లేకుండా, ఇంకా సరిగ్గా నడవటం కూడా రాకముందే, తాడు మీద, సన్న సన్న గోడల మీద నడిచే శిక్షణనివ్వటంం మొదలు పెట్టారు దానికి. అయితే అది చాలా మంచిది- త్వరలోనే తాడు మీద నడిచే విద్యను నేర్చేసుకున్నది. "ఏనుగుపిల్ల చాలా బాగా నడుస్తుందట!" అవి సర్కస్ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. దాంతో 'రాక్'ని చూసేందుకే సర్కస్‌కు వచ్చే జనాలు ఎక్కువైనారు. అయినా 'రాక్' కు హింస తప్పలేదు. మరిన్ని కొత్త విద్యలు నేర్చుకోవాలని మాస్టర్లు దాన్ని బలవంత పెడుతూనే ఉన్నారు. విసిగిపోయిన 'రాక్' ఒక రోజున సర్కస్ నుండి తప్పించుకొని పారిపోయింది!

 

సర్కస్ లోంచి అయితే బయటికి వచ్చింది గానీ, రాక్ కు ఎటుపోవాలో తెలీదు. జనాలు ఎవ్వరికీ దాని భాష, దాని బాధ తెలియదు. అయితే దాని అదృష్టం కొద్దీ అది ప్రముఖ వైల్డ్ ఎక్స్ పర్ట్ 'రాణి' కంట పడింది. రాణికి జంతువులంటే ప్రేమ. వాటి భావం, వాటి కన్నీటికి అర్ధం తెలుసు ఆమెకు. ఆమె 'రాక్' పై ఉన్న వాతల్ని, దాని కన్నీటి చారల్ని చూసి దాన్ని అర్థం చేసుకున్నది. దానితో స్నేహం చేసింది, పరిశోధించి, దాని వివరాలన్నీ‌ కనుక్కున్నది. ఎవ్వరూ దాన్ని హింసించకుండా అడ్డుకున్నది. "దాన్ని, దానిలాంటి ఇతర జంతువులను కాపాడాలి" అని పత్రికల్లో రాసింది.

 

సర్కస్ కంపెనీలు ఆమెకు వ్యతిరేకంగా చాలా ప్రచారం చేసాయి కానీ, చివరికి రాణి మాటల్లో సత్యం ఉందని అందరూ గ్రహించారు. గవర్నమెంటు వారు కూడా 'ఆనిమల్ రైట్స్'ని గుర్తించారు. 'మానవులు తమ వినోదం కోసం జంతువులను ఆడించరాదు' అని చట్టం వచ్చింది. సర్కస్‌లలో 'జంతువులని వాడుకోవటం' అనే దురాచారానికి తెర పడింది. ఆనాటి నుండీ‌ సర్కస్‌లలో జంతువులను ఆడించి సొమ్ము చేసుకోవటం తగ్గిపోయింది!


 - కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ, మనుమడు ఉండేవాళ్ళు.
Jan 18, 2019
అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు, చేపలు ఉండేవి...
Jan 11, 2019
బ్రహ్మదత్తుడు కాశీ రాజ్య పీఠాన్ని అధిరోహించకముందు యువరాజుగా విలాస...
Dec 31, 2018
ఏసుక్రీస్తు పుట్టటానికి ఆరువందల సంవత్సరాల ముందు గ్రీసు దేశంలో...
Dec 20, 2018
నల్లమల అడవుల్లో వీరసముద్రం చెరువు చుట్టుప్రక్కల పెద్ద పెద్ద ఏనుగుల గుంపులు...
Dec 17, 2018
అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఫకీర్‌ అనే ఒక స్నేహితుడు ఉండేవాడు...
Dec 12, 2018
నక్క పాట
Dec 11, 2018
కొత్తపల్లిలో రాజు అనే పిల్లవాడు ఉండేవాడు. వాడికి పక్షులన్నా, జంతువులన్నా...
Nov 24, 2018
అనగనగా పెద్ద కొండ ఒకటి ఉండేది. ఆ కొండ మీద అనేక రకాల వృక్షజాతులు జీవనం..
Nov 22, 2018
అనగనగా ఒక రాజు. ఆయన ఏ కొరత రానివ్వక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గర ఒక బానిస ఉన్నాడు.
Nov 16, 2018
TeluguOne For Your Business
About TeluguOne