Home » పిల్లల కోసం » భలే మేకుFacebook Twitter Google
భలే మేకు

భలే మేకు

 


అనగనగా ఒక ఊరిలో ఒక రంగయ్య ఉండేవాడు. ఒకసారి ఆ రంగయ్యకు ఓ పెద్దాయన ఓ కేలెండర్ ఇచ్చారు. రంగయ్య దాన్ని తెచ్చి ఇంట్లో మేకుకు తగిలించి, "బట్టలు కొనుక్కుంటే నయం" అనుకొని త్రిపురాంతకం వెళ్లాడు. అప్పుడు వాళ్ల ఇంట్లోకి ఓ కుక్క దూరింది. దూరగానే దానికి రంగుల రంగుల కేలెండరూ, దాన్ని తగిలించిన మేకూ కనిపించాయి. దానికి ఆ కేలెండరు బాగా పరిచయం ఉన్నట్లు అనిపించి, "దగ్గరికి వెళ్లి చూద్దాం" అని అక్కడికి వెళ్ళింది. 

అది తన దగ్గరికి రాగానే మేకుకు చాలా సంతోషం వేసింది- "కుక్కా! బాగున్నావా?" పలకరించింది మేకు. "ఏదో, ఉన్నాను. నువ్వు బాగున్నావా?" అంది కుక్క. "నాకేమి? నేను మేకులాగా ఉన్నాను. చాలా బాగున్నాను " అన్నది మేకు. "మీ క్యాలండర్ అచ్చంగా మా పాత ఇంట్లో క్యాలండరు లాగే ఉన్నది. మీ యజమాని ఫొటో ఉందా ఎక్కడైనా?" అడిగింది కుక్క.

"అదిగో, అక్కడ వ్రేలాడుతున్నది ఆయన ఫొటోనే" అంది మేకు. "అయ్యో! మీ రంగయ్య చాలా చెడ్డవాడే, పాపం నీది కూడా నాలాంటి కష్టపు బ్రతుకేనన్నమాట!" అంది కుక్క రంగయ్య ఫొటోని చూస్తూ. "ఏమీ లేదు. రంగయ్య చాలా మంచోడు. నీకెందుకు అట్లా అనిపించింది?" అడిగింది మేకు, ఆశ్చర్యపోతూ. "మా యజమాని గురించి నీకు తెలీదు కదా, అచ్చం రంగయ్య లాగే ఉంటాడు. చాలా చెడ్డవాడు. మీ రంగయ్య కూడా ఆయన లాగే చాలా చెడ్డవాడు అయిఉంటాడు. ఇంకేమి?" అంది కుక్క.

"ఏమీ లేదే! రంగయ్య నన్ను ఏమీ అనడే?!" ఆశ్చర్యపోయింది మేకు. "నువ్వైతే మేకువు- సరే. మరి మీ ఇంట్లో కుక్కను బాగా చూసుకుంటాడా, రంగయ్య?" అడిగింది కుక్క. "మా ఇంట్లో కుక్కే లేదు అసలు! అదే ఉంటే‌ నువ్వు ఇక్కడ ఎట్లా నిలబడేదానివి?!" నవ్వింది మేకు. "అదేంటి- రంగయ్య, మా యజమాని ఒకేలాగా ఉన్నప్పుడు, మీ ఇంట్లో కూడా నాలాంటి కుక్క ఉండాల్సిందేనే?!" అంది కుక్క, కుక్కలాగా ఆలోచించి.

మేకుకు ఏమనాలో తెలియలేదు. అప్పుడు గుర్తొచ్చింది- రంగయ్య బిడ్డ రోజూ చదివే పద్యం ఒకటి అప్పుడు అర్థమైంది దానికి. కుక్కని చూసి నవ్వుతూ అది చెప్పింది. "చూడు కుక్కా, ఉప్పు, కర్పూరం చూసేందుకు ఒకేలాగా ఉంటాయి. కానీ వాటి రుచులు పూర్తిగా వేరుగా ఉంటై. అట్లాగే మనుషులు కూడా-చూపులకు ఒకేలాగా ఉన్నా, మనసులు, ప్రవర్తన మటుకు వాటి ఇష్టం వచ్చినట్లు అవి ఉంటాయి. 

అందుకని మనిషుల్ని పరిశీలించకుండా, వాళ్ల రూపాన్ని బట్టి 'మంచి-చెడ్డ' అని చెప్పలేం తల్లీ!" అంది. మామూలుగా అయితే కుక్క ఏదో అనేదే గానీ, పద్యం విన్నాక ఇంక అనేందుకు ఏమీ లేక,"బాబోయ్! ఇది భలే మేకు" అనుకుంటూ వెళ్లిపోయింది.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


ఒక అడవి అంచున చెన్నప్ప అనే బోయవాడు ఒకడు ఉండేవాడు...
Oct 13, 2018
అనగనగా ఒక అడవిలో ఒక కోడి ఉండేది. అడవి అవతల ఉన్న ఊళ్లోకి వెళ్ళి
Oct 10, 2018
అనగా అనగా ఒక అడవిలో జింక ఒకటి ఉండేది...
Oct 6, 2018
విజయనగర సామ్రాజ్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆనాడు రాజు గారి పుట్టిన రోజు....
Oct 1, 2018
నా పేరు రాము నేను మీ అంత వయసులో ఉన్నప్పుడు,
Sep 26, 2018
పండుకి ఆరేళ్ళు. ఈమధ్యే కొత్తగా బడికి వెళ్ళటం మొదలు పెట్టాడు.
Sep 22, 2018
ఒక రోజున వెంగళప్ప వాళ్ల నాన్నతో కలిసి అంగడికి వెళ్లాడు...
Sep 21, 2018
అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు నివిసించేవి...
Sep 20, 2018
నల్లమల అడవుల్లో చిట్టి లేడిపిల్ల ఒకటి ఉండేది....
Sep 17, 2018
ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి. అవి ఒక రోజు సమావేశం అయ్యాయి...
Sep 14, 2018
TeluguOne For Your Business
About TeluguOne